Century Mattresses: సోఫా విభాగంలోకి సెంచురీ మ్యాట్రెసెస్
ABN , Publish Date - Sep 27 , 2025 | 05:58 AM
Century Mattresses Enters Sofa Segment Targeting Rs 1 Lakh 3 Thousand Crore Furniture Market
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): స్లీపింగ్ సొల్యూషన్స్ సంస్థ సెంచురీ మ్యాట్రెసెస్.. సోఫా విభాగంలోకి ప్రవేశించింది. రూ.1.3 లక్షల కోట్ల విలువైన ఫర్నీచర్ మార్కెట్లో అవకాశాలు చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో ఇందులోకి అడుగుపెట్టినట్లు సెంచురీ సోఫా ఈడీ ఉత్తమ్ మలానీ తెలిపారు. శుక్రవారం నాడిక్కడ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ పీవీ సింధుతో కలిసి ఆరు కలెక్షన్స్‌తో కూడిన సోఫాలను ఆయన మార్కెట్లోకి విడుదల చేశారు. అనంతరం మలానీ మాట్లాడుతూ.. మ్యాట్రెసెస్ వ్యాపార పరిమాణంతో పోల్చితే ఈ విభాగం దాదాపు ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుందన్నారు. సోఫా విభాగంలో 10 శాతం మాత్రమే సంఘటిత రంగంలో ఉందని పేర్కొన్నారు. సోఫాల తయారీ కోసం హైదరాబాద్ సమీపంలో ఉన్న మ్యాట్రెసెస్ ప్లాంట్‌లోనే రూ.35 కోట్లతో యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత మరో రూ15 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
మండలిలో అచ్చెన్న, బొత్స మధ్య మాటల యుద్ధం
Read latest AP News And Telugu News