FIR Against Anil Ambani: వరుస వివాదాల్లో రిలయన్స్ అధినేత.. సీబీఐ కేసు..
ABN , Publish Date - Sep 05 , 2025 | 08:54 AM
ఎస్‌బీఐ నుంచి రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు ఇంటర్ కంపెనీ లోన్ లావాదేవీలు జరిగాయని బ్యాంకు తెలిపింది. కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతర వ్యక్తులు కూడా మోసంలో భాగం అయినట్లు వెల్లడించింది.
బిజినెస్ డెస్క్: రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎస్‌బీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్((RCom)తోపాటు ఆ కంపెనీ డైరెక్టర్ అనిల్ అంబానీపై ‘ది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ (సీబీఐ) దర్యాప్తునకు సిద్ధమైంది. ఆగస్టు 21వ తేదీన సీబీఐని ముంబై ఎస్‌బీఐ బ్యాంకు ఆశ్రయించింది. ముంబైకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్, దాని డైరెక్టర్ అనిల్ అంబానీ తప్పుడు అకౌంట్స్ చూపించి, మోసపూరితంగా రూ.2,219 కోట్లు లోన్ పొందినట్లు ఫిర్యాదు చేసింది.
ఎస్‌బీఐ నుంచి రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు ఇంటర్ కంపెనీ లోన్ లావాదేవీలు జరిగాయని తెలిపింది. కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతర వ్యక్తులు కూడా మోసంలో భాగం అయినట్లు వెల్లడించింది. బ్యాంకును మోసం చేసి రూ.2929.05 కోట్ల నష్టం వచ్చేలా చేశారని పేర్కొంది. ఎస్‌బీఐ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో క్రిమినల్ కాన్‌స్పిరసీ, చీటింగ్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, క్రిమినల్ మిస్ కండక్ట్ అండర్ ది ప్రివిషన్స్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద సీఐబీ క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తునకు సిద్ధమైంది.
ఆరోపణల్ని కొట్టేసిన అనిల్ ప్రతినిధి
ఎస్‌బీఐ పెట్టిన కేసుపై అనిల్ అంబానీ ప్రతినిధి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఎస్‌బీఐ దాదాపు పదేళ్ల క్రితం ఆ కేసు పెట్టింది. ఆ సమయంలో అనిల్ అంబానీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రతీ రోజూ కంపెనీలో జరిగే పనులతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఎస్‌బీఐ ఐదుగురు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లపై కేసును ఉపసంహరించుకుంది. ప్రస్తుతం రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని కమిటీ ఆఫ్ క్రెడిట్స్ పర్యవేక్షణలో నడుస్తోంది. అనిల్ అంబానీ తనపై వస్తున్న ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు’ అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
వార్నీ.. చివరకు నకిలీ టికెట్లు కూడానా.. విషయం ఏంటంటే..
బ్యాంక్ ఉద్యోగిని కొంపముంచిన ఏఐ.. ఇంత మోసమా?..