CBDT Chairman Confirms: డిసెంబరు కల్లా రిఫండ్స్ పూర్తి
ABN , Publish Date - Nov 18 , 2025 | 06:22 AM
సక్రమంగా ఉన్న ఐటీ రిటర్న్‌లపై రిఫండ్స్ చెల్లింపులు ఈ నెలాఖరు లేదా వచ్చే నెలాఖరు కల్లా పూర్తవుతాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ రవి అగర్వాల్ ప్రకటించారు. కొంతమంది...
సీబీడీటీ చైర్మన్ రవి అగర్వాల్
న్యూఢిల్లీ: సక్రమంగా ఉన్న ఐటీ రిటర్న్‌లపై రిఫండ్స్ చెల్లింపులు ఈ నెలాఖరు లేదా వచ్చే నెలాఖరు కల్లా పూర్తవుతాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ రవి అగర్వాల్ ప్రకటించారు. కొంతమంది రిఫండ్స్ కోసం తప్పుడు డిడక్షన్స్ క్లెయిమ్ చేయడంతో వాటన్నిటిని పరిశీలించి క్లియర్ చేయాల్సి రావడంతోనే ప్రస్తుతం రిఫండ్స్ ఆలస్యమవుతోందన్నారు. ఇప్పటికే ఫైల్ చేసిన రిటర్న్‌లో ఏవైనా విషయాలు మర్చిపోతే సవరించిన రిటర్న్ ఫైల్ చేయాలని కూడా పన్ను చెల్లింపుదారులకు లేఖలు రాసినట్టు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రిఫండ్స్‌లోనూ ప్రతికూల వృద్ధి కనిపిస్తోందన్నారు. రిఫండ్స్ క్లెయిమ్స్ తగ్గడం ఇందుకు కారణమని అగర్వాల్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి లక్ష్యంగా నిర్ణయించిన రూ.25.20 లక్షల కోట్ల పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
అమెరికాలో నిపుణులైన వర్కర్ల కొరత ఉంది.. ఫోర్డ్ సీఈఓ ఆందోళన
అమెరికాలో భారీ స్థాయిలో ఉద్యోగాల్లో కోతలు.. సంచలన నివేదికలో వెల్లడి
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి