Bank Holidays: జనవరి 2026లో బ్యాంక్ హాలిడేస్.. వివరాలు
ABN , Publish Date - Dec 23 , 2025 | 09:50 AM
RBI హాలిడేస్‌ను మూడు కేటగిరీలుగా విభజిస్తుంది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద, RTGS హాలిడేస్, ఇంకా అకౌంట్స్ క్లోజింగ్ డే. రాష్ట్రాల్లో స్థానిక పండుగలు ఆధారంగా ఇవి మారుతాయి. ఇక, 2026 జనవరిలో సెలవుదినాలు..
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 23: భారతదేశంలో జనవరి 2026లో బ్యాంకులకు మొత్తం 15 రోజులు సెలవుదినాలున్నాయి. ఇందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయించిన జాతీయ, రాష్ట్రీయ పండుగలు, వీకెండ్స్ (రెండు, నాలుగవ శనివారాలు, ఇంకా సండేలు) ఉన్నాయి. అయితే, ఈ సెలవు దినాలు అన్ని రాష్ట్రాల్లో ఒకేవిధంగా వర్తించవు. రాష్ట్రాల వారీగా స్థానిక పండుగలు ఆధారంగా మారుతాయి. అయితే, ఆన్‌లైన్ బ్యాంకింగ్, UPI, NEFT వంటివి ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.
బ్యాంక్ హాలిడేస్ (పండుగలు/సందర్భాలు):
జనవరి 1: న్యూ ఇయర్ డే / గాన్-న్గై (కొన్ని రాష్ట్రాలు)
జనవరి 2: న్యూ ఇయర్ సెలబ్రేషన్ / మన్నం జయంతి
జనవరి 12: స్వామి వివేకానంద జయంతి
జనవరి 14: మకర సంక్రాంతి / మాఘ బిహు
జనవరి 15: ఉత్తరాయణ పుణ్యకాలం / పొంగల్ / మాఘే సంక్రాంతి
జనవరి 16: తిరువళ్లువర్ డే (ప్రధానంగా తమిళనాడులో)
జనవరి 17: ఉజవర్ తిరునాళ్
జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి / సరస్వతీ పూజ / బసంత పంచమి
జనవరి 26: రిపబ్లిక్ డే (జాతీయ హాలిడే – అన్ని రాష్ట్రాలు)
ఇవికాక, వీకెండ్స్ (శని, ఆదివారాలు): జనవరి 4 (సండే)
జనవరి 10 (రెండవ శనివారం)
జనవరి 11 (ఆదివారం)
జనవరి 18 (ఆదివారం)
జనవరి 24 (4వ శనివారం)
జనవరి 25 (ఆదివారం)
మీ రాష్ట్రంలేదా నగరానికి సంబంధించిన కచ్చితమైన లిస్ట్ కోసం మీ బ్యాంక్ బ్రాంచ్ లేదా RBI వెబ్‌సైట్ చెక్ చేయండి. ఈ హాలిడేస్‌తో మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ముందుగానే చేసుకోండి. చెక్ క్లియరెన్స్, లోన్ పేమెంట్స్ వంటివి ఆలస్యం కాకుండా చూసుకోండి.
ఈ వార్తలు కూడా చదవండి:
Lord Hanuman: దేశంలో ప్రసిద్ది పొందిన హనుమాన్ దేవాలయాలు.. ఎక్కడ ఉన్నాయో తెలుసా?
IND Vs NZ: ఇండియాతో వన్డే సిరీస్.. 'కేన్ మామ' సంచలన నిర్ణయం.!