దాన ధర్మాలకు మరో రూ 51300 కోట్లు
ABN , Publish Date - Jun 30 , 2025 | 03:13 AM
అమెరికా కుబేరుడు, స్టాక్ మార్కె ట్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. అమెరికా కేంద్రంగా పనిచేసే ఐదు స్వచ్ఛంద సేవా సంస్థలకు...
న్యూయార్క్: అమెరికా కుబేరుడు, స్టాక్ మార్కె ట్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. అమెరికా కేంద్రంగా పనిచేసే ఐదు స్వచ్ఛంద సేవా సంస్థలకు తన నిర్వహణలోని బెర్క్‌షైర్ హాత్‌వేకు చెందిన 600 కోట్ల డాలర్ల (సుమారు రూ.51,300 కోట్లు) విలువైన 1.24 కోట్ల షేర్లను విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో 2006 నుంచి ఈ ఐదు సంస్థలకు బఫెట్ విరాళంగా ఇచ్చిన షేర్ల విలువ 6,000 కోట్ల డాలర్లకు (సుమా రు రూ.5.13 లక్షల కోట్లు) చేరింది. సోమవారం ఈ షేర్లను ఆయా స్వచ్ఛంద సేవా సంస్థల పేరు మీద బదిలీ చేయనున్నట్టు బఫెట్ తెలిపారు.
Also Read:
యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..
నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...
For More Telugu News