బడ్జెట్‌తో తగ్గిన నిబంధనల భారం
ABN , Publish Date - Feb 03 , 2025 | 06:42 AM
కేంద్ర బడ్జెట్ మధ్యతరగతితో పాటు కార్పొరేట్ రంగాన్నీ మెప్పిస్తోంది. ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అనేక పన్ను సంస్కరణలు ప్రవేశపెట్టారు. టీడీఎ్‌సతో పాటు టీసీఎస్ చెల్లింపులను...

ఊపిరి పీల్చుకుంటున్న కంపెనీలు
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ మధ్యతరగతితో పాటు కార్పొరేట్ రంగాన్నీ మెప్పిస్తోంది. ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అనేక పన్ను సంస్కరణలు ప్రవేశపెట్టారు. టీడీఎ్‌సతో పాటు టీసీఎస్ చెల్లింపులను సులభతరం చేశారు. స్టార్టప్ కంపెనీలకూ పన్ను విరామాలు ప్రకటించారు. ఈ చర్యలతో సులభతర వాణిజ్యం మరింత ఊపందుకుంటుందని కార్పొరేట్ రంగం అంచనా. కార్పొరేట్ రంగానికి సంబంధించి తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం చేసిన మార్పులు ఏమిటంటే..
స్టార్టప్ కంపెనీలకు తొలి 10 ఏళ్లలో మూడేళ్ల పాటు ట్యాక్స్ బ్రేక్‌పలు లభిస్తాయి.
విలీనాలతో ఏర్పడే కొత్త కంపెనీలకు మాత్రమే మిగతా కాలానికి.. గత నష్టాలను క్యారీ ఫార్వర్డ్ సదుపాయం లభిస్తుంది.
అద్దెలు, టెక్నికల్ సర్వీసులపై చెల్లించే టీడీఎ్‌స/టీసీఎస్ కనీస పరిమితులు పెంచారు. దీంతో కంపెనీలకు చిన్న చిన్న లావాదేవీలపై కంప్లయన్స్ భారం తగ్గింది.
వస్తువుల అమ్మకాల విలువ రూ.50 లక్షలు మించినప్పుడు చెల్లించే టీడీఎస్, టీసీఎస్ మొత్తాన్ని 0.1 శాతానికి పరిమితం చేశారు.
జీఎ్‌సటీ రిటర్న్‌లు ఫైల్ చేయని వారిపై విఽధించే అదనపు 20 శాతం టీడీఎ్‌స/టీడీఎ్‌సను రద్దు చేశారు.
టీసీఎస్ చెల్లింపులు ఆలస్యమైనా రిటర్న్‌లు సకాలంలో ఫైల్ చేసే కంపెనీలు, వ్యాపార సంస్థలపై ఇక కేసులు నమోదు చేయరు.
అప్‌డేటెడ్ ట్యాక్స్ రిటర్న్‌లు ఫైల్ చేసే గడువు. రెండేళ్ల నుంచి నాలుగేళ్లకు పెంపు. కాకపోతే మూడో సంవత్సరంలో ఫైల్ చేస్తే 60 శాతం, నాలుగో ఏడాది ఫైల్ చేస్తే 70 శాతం అదనంగా చెల్లించాలి.
కంపెనీలు ఒకే ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ విధానాన్ని మూడేళ్ల వరకు కొనసాగించవచ్చు. దీంతో రిలేటెడ్ పార్టీ లావాదేవీలతో ఏర్పడే వివాదాలు తగ్గుముఖం పడతాయని భావించ వచ్చు.
కేసు ప్రొసీడింగ్స్ ప్రారంభమైన ఆరు నెలల లోపు పన్ను వసూలు అధికారులు పెనాల్టీ ఆర్డర్లు పాస్ చేయాలి.
భారత ఎలకా్ట్రనిక్ కంపెనీలకు సాంకేతిక సేవలు అందించే విదేశీ సంస్థలు, వ్యక్తులు ఇక తమ మొత్తం ఆదాయంలో 25 శాతం పన్నుగా చెల్లిస్తే సరిపోతుంది.
ఇవి కూడా చదవండి:
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు భక్తజనం.. ఫిబ్రవరి 1 నాటికి ఎంత మంది వచ్చారంటే..
Sonia Gandhi: సోనియా గాంధీపై కోర్టులో ఫిర్యాదు చేసిన న్యాయవాది.. ఎందుకంటే..
Waqf Amendment Bill: ఫిబ్రవరి 3న లోక్‌సభకు వక్ఫ్ సవరణ బిల్లు 2024 నివేదిక
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News