ప్రైవేటీకరణకు పెద్దపీట
ABN , Publish Date - Feb 02 , 2025 | 03:54 AM
ఆదాయపన్ను విధానంలో మార్పులు, అందులో సవరించిన శ్లాబులు మధ్యతరగతికి ఊరటకలిగించేలా ఉన్నమాట వాస్తవమే అయినా..
బడ్జెట్లో ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తున్నట్లు అనిపిస్తోంది. ప్రభుత్వ రంగంలో లాభాలు తెచ్చిపెట్టే బీమా రంగంలో వంద శాతం ఎఫ్‌డీఐలకు అనుమతించడం అందులో భాగమే..! ఆదాయపన్ను విధానంలో మార్పులు, అందులో సవరించిన శ్లాబులు మధ్యతరగతికి ఊరటకలిగించేలా ఉన్నమాట వాస్తవమే అయినా.. ఉద్యోగుల వేతనాలలో మార్పు లేకపోవడం, నిరుద్యోగం వంటి కారణాలతో కొనుగోలు శక్తి తగ్గింది. దాంతో ప్రైవేటు పెట్టుబడులు పెరగడం లేదు. కొత్త పన్ను విధానం వల్ల రూ.7లక్షలకు పైన ఆదాయం ఉన్నవారు కొంత వరకు లబ్ధి పొందినా.. వారి సంఖ్య చాలా తక్కువ. ఉద్యోగ కల్పన మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, దిగువ, పేద వర్గాల ఆదాయ మార్గాన్ని పెంచకుండా ఇలాంటి సంకుచిత చర్యల వల్ల ఒరిగేదేమీ ఉండదు.
- ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి, ఆర్థిక విశ్లేషకుడు
ఇవీ చదవండి:
ఏపీకి కేంద్రం వరాల జల్లు.. కేటాయింపులు అదిరిపోయాయి
కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలు ఇవే..
భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరల
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి