బిఎస్ఎన్ఎల్ కు రెండో వరుస లాభం
ABN , Publish Date - May 28 , 2025 | 05:48 AM
ప్రభుత్వ రంగంలోని టెలికం కంపెనీ బిఎస్ఎన్ఎల్ లాభా ల బాటలో కొనసాగుతోంది. మార్చి 31వ తేదీతో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ.280 కోట్ల లాభం నమోదు చేసింది. అంతకు ముందు...
18 సంవత్సరాల తర్వాత ఇదే ప్రథమం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని టెలికం కంపెనీ బిఎస్ఎన్ఎల్ లాభా ల బాటలో కొనసాగుతోంది. మార్చి 31వ తేదీతో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ.280 కోట్ల లాభం నమోదు చేసింది. అంతకు ముందు డిసెంబరు త్రైమాసికంలో కూడా సంస్థ రూ.262 కోట్ల నికర లాభం ప్రకటించింది. 2007 తర్వాత బిఎస్ఎన్ఎల్ వరుసగా రెండు త్రైమాసికాలు నికర లాభాలు ఆర్జించడం ఇదే మొదటిసారని కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింథియా చెప్పారు. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.849 కోట్ల నికర నష్టాలు చవిచూసింది.
ఏడాది మొత్తంలో తగ్గిన నష్టం: మార్చితో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తానికి చూస్తే మాత్రం బిఎస్ఎన్ఎల్ కు నష్టాలు తప్పలేదు. అయితే 2023-24తో పోల్చితే నష్టం రూ.5,370 కోట్ల నుంచి రూ.2,247 కోట్లకు తగ్గింది. అంటే నష్టం 58 శాతం తగ్గిందన్న మాట.
2023-24 ఆర్థిక సంవత్సరంలో మూడు సర్కిల్స్ మాత్రమే లాభాలు నమోదు చేయగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 10 సర్కిల్స్ లాభాలు నమోదు చేసినట్టు సింథియా చెప్పారు. ఇదే సమయంలో కంపెనీ స్థూల ఆదాయం 10 శాతం పెరిగి రూ.23,400 కోట్లకు, నిర్వహణ ఆదాయం 7.8 శాతం పెరిగి రూ.20,841 కోట్లకు చేరాయని సింథియా చెప్పారు.
ఇవీ చదవండి:
నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం
వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి