ఐదు రోజుల నష్టాలకు బ్రేక్
ABN , Publish Date - Feb 26 , 2025 | 05:36 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిసాయి. సెన్సెక్స్ ఐదు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఫైనాన్షియల్, ఎఫ్‌ఎంసీజీ కంపెనీల షేర్ల లాభాలతో 147.71 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 74,602.12 వద్ద ముగిసింది...

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిసాయి. సెన్సెక్స్ ఐదు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఫైనాన్షియల్, ఎఫ్‌ఎంసీజీ కంపెనీల షేర్ల లాభాలతో 147.71 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 74,602.12 వద్ద ముగిసింది. ట్రేడింగ్ చివర్లో ఫార్మా, మెటల్, ఐటీ కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో నిఫ్టీ మాత్రం వరుసగా ఆరో రోజూ స్వల్పంగా 5.8 పాయింట్లు నష్టపోయి 22,547.55 వద్ద క్లోజైంది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 17 కంపెనీల షేర్లు లాభాలతో, 13 కంపెనీల షేర్లు నష్టాలతో ముగిశాయి. ఆసియా, అమెరికా మార్కెట్లు బలహీనంగా ఉండడం, కొనసాగుతున్న ఎఫ్‌పీఐల అమ్మకాలతో మదుపరులెవరూ కొనుగోళ్లపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. డాలర్‌తో రూపాయి మారకం రేటు పతనం, ట్రంప్ సుంకాల హెచ్చరికలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి. కాగా జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ మంగళవారం నాన్ కన్వర్టబుల్ బాండ్ల జారీ ద్వారా రూ.1,100 కోట్లు సమీకరించింది.
‘బేర్’మన్న రూపాయి
ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం రేటు మరోసారి ‘బేర్’మంది. మంగళవారం ఉదయం డాలర్‌తో 11 పైసల నష్టంతో రూ.86.83 వద్ద ప్రారంభమైన రూపాయి చివరికి 47 పైసల నష్టంతో రూ.87.19 వద్ద ముగిసింది. వచ్చే కొద్ది రోజుల్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు రూ.86.85-87.40 మధ్య ట్రేడయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. ముడి చమురు ధర మరింత తగ్గితే తప్ప ఇప్పట్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు పుంజుకునే అవకాశం కనిపించడం లేదు.
నేడు మార్కెట్లకు సెలవు
మహా శివరాత్రి సందర్భంగా బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజీలు బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈలకు సెలవు ప్రకటించారు. ఫారెక్స్, బులియన్ మార్కెట్లు కూడా పనిచేయవు. గురువారం మార్కెట్లు యధావిధిగా పనిచేస్తాయి.
ఇవి కూడా చదవండి:
Amit Shah: 2 రోజుల్లోనే రూ. 30,77,000 కోట్ల పెట్టుబడులు.. కేంద్ర హోమంత్రి అమిత్ షా ప్రశంసలు
Liquor Scam: లిక్కర్ స్కాం వల్ల ప్రభుత్వానికి 2 వేల కోట్లకుపైగా నష్టం..
Ashwini Vaishnaw: మన దగ్గర హైపర్ లూప్ ప్రాజెక్ట్ .. 300 కి.మీ. దూరం 30 నిమిషాల్లోనే..
Maha Kumbh Mela: శివరాత్రికి ముందే మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తజనం.. ఇప్పటివరకు ఎంతమంది వచ్చారంటే..
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Read More Business News and Latest Telugu News