Share News

బీపీసీఎల్‌ లాభంలో 24% క్షీణత

ABN , Publish Date - Apr 30 , 2025 | 05:38 AM

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌).. 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికం (క్యూ4)లో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది...

బీపీసీఎల్‌ లాభంలో 24% క్షీణత

న్యూఢిల్లీ: భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌).. 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికం (క్యూ4)లో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికానికి గాను స్టాండ్‌ఎలోన్‌ నికర లాభం 24 శాతం క్షీణించి రూ.3,214.06 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం లాభం రూ.4,224.18 కోట్లుగా ఉంది. రిఫైనింగ్‌ మార్జిన్లు తగ్గటం. సబ్సిడీ వంటగ్యాస్‌ (ఎల్‌పీజీ) విక్రయాలపై నష్టాలు కంపెనీ పనితీరును దెబ్బతీశాయి. మరోవైపు మార్చి త్రైమాసికంలో ఆదాయం కూడా 4 శాతం తగ్గి రూ. 1.26 లక్షల కోట్లకు పడిపోయింది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి నికర లాభం సగానికి పైగా తగ్గి రూ.13,275.26 కోట్లుగా ఉండగా మొత్తం ఆదాయం రూ.5 లక్షల కోట్లుగా నమోదైంది. కాగా ఒక్కో షేరుకు రూ. 5 తుది డివిడెండ్‌ను కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. గతంలో చెల్లించిన రూ. 5 మధ్యంతర డివిడెండ్‌కు ఇది అదనం.

ఇవి కూడా చదవండి

Live In Partner: పదేళ్ల సహజీవనం.. బెడ్డు కింద ప్రియురాలి శవం..

అడిగినంత పనీర్ వేయలేదని పెళ్లి మండపంలో దారుణం..

Updated Date - Apr 30 , 2025 | 05:38 AM