Share News

బొండాడ గ్రూప్‌నకు తమిళనాడు కాంట్రాక్టు

ABN , Publish Date - Jun 24 , 2025 | 04:08 AM

మౌలిక వసతుల రంగంలో వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీల్లో ఒకటైన బొండాడ గ్రూప్‌నకు తమిళనాడు గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ నుంచి భారీ కాంట్రాక్టు...

బొండాడ గ్రూప్‌నకు తమిళనాడు కాంట్రాక్టు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మౌలిక వసతుల రంగంలో వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీల్లో ఒకటైన బొండాడ గ్రూప్‌నకు తమిళనాడు గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ నుంచి భారీ కాంట్రాక్టు లభించింది. ఈ కాంట్రాక్టు కింద తమిళనాడులోని వెల్లలవిడుతి, తేనాంపట్టి ప్రాంతాల్లో 400 ఎండబ్ల్యూహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజి వ్యవస్థను (బీఈఎ్‌సఎస్‌) నిర్మించాల్సి ఉంటుంది. బిల్డ్‌-ఓన్‌-ఆపరేట్‌ (బీఓఓ) మోడల్‌ కింద చేపట్టే ఈ ప్రాజెక్టుకు పోటీ టెండరింగ్‌ విధానంలో నిర్వహించిన బిడ్డింగ్‌లో బొండాడ గ్రూప్‌ విజయవంతమైన బిడ్డర్‌గా నిలిచింది. 12 సంవత్సరాల పాటు అమలులో ఉండే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ కొనుగోలు ఒప్పందం కింద బొండాడ గ్రూప్‌ నుంచి తమిళనాడు జెనరేషన్‌ అండ్‌ డిస్ర్టిబ్యూషన్‌ కార్పొరేషన్‌ (టాన్‌జెడ్కో) బ్యాటరీ ఎనర్జీ స్టోరేజి సేవలు పొందుతుంది. ఇది బొండాడ గ్రూప్‌ ఎనర్జీ స్టోరేజి విభాగానికి కీలక మైలురాయి అని గ్రూప్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాఘవేంద్రరావు బొండాడ అన్నారు.

ఇవీ చదవండి:

ఇరాన్‌లో ఉద్రిక్తతలు.. ముడి చమురు ధరలకు రెక్కలు

సేవింగ్స్ అకౌంట్‌లో మీ డబ్బు ఉందా.. అయితే మీరీ విషయాలు తప్పక తెలుసుకోవాలి

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 24 , 2025 | 04:08 AM