బోయింగ్ షేరు ఢమాల్
ABN , Publish Date - Jun 13 , 2025 | 05:11 AM
గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కొద్ది నిమిషాలకే కుప్పకూలింది...
గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కొద్ది నిమిషాలకే కుప్పకూలింది. దాంతో ఆ విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో 241 మంది చనిపోయారు. ఈ ఘోర ప్రమాదం నేపథ్యంలో అమెరికా మార్కెట్లో బోయింగ్ షేరు గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో 5 శాతం వరకు క్షీణించింది. మార్కెట్ ప్రారంభానికి ముందు ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో 8 శాతం వరకు పతనమైంది. ఈ ఘటనతో అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలకూ అంతరాయం కలిగింది. దాంతో దేశీయ లిస్టెడ్ ఎయిర్‌లైన్స్ ఇండిగో షేరు బీఎ్‌సఈలో 2.65 శాతం నష్టపోగా.. స్పైస్‌జెట్ షేరు 1.78 శాతం క్షీణించింది. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నిర్వహణ సంస్థ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు ధర కూడా 1.54 శాతం తగ్గింది.
ఈ వార్తలు కూడా చదవండి..
వణికించిన టాప్ 10 విమాన ప్రమాదాలు..
ఎయిర్ ఇండియా ప్రమాదం ఫస్ట్ వీడియో
For National News And Telugu News