Share News

జిఎస్‌కెతో భారత్‌ బయోటెక్‌ జట్టు

ABN , Publish Date - Jun 13 , 2025 | 05:09 AM

అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం జీఎ్‌సకే పీఎల్‌సీతో హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (బీబీఐఎల్‌) భాగస్వామ్య ఒప్పందం...

జిఎస్‌కెతో భారత్‌ బయోటెక్‌ జట్టు

సంయుక్తంగా డయేరియా వ్యాక్సిన్‌ తయారీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం జీఎ్‌సకే పీఎల్‌సీతో హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (బీబీఐఎల్‌) భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా బ్యాక్టీరియా ద్వారా వ్యాపించే అధిక తీవ్రత గల అతిసార (డయేరియా) వ్యాధి (షిగెలోసిస్‌) కట్టడికి ఉపయోగించే వ్యాక్సిన్‌ను తయారు చేయనుంది. ఆల్ట్‌సోన్‌ఫ్లెక్స్‌ 1-2-3 పేరిట జీఎ్‌సకే ఇప్పటికే రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ ప్రస్తుతం క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యాక్సిన్‌ ఇది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో అధికారిక లైసెన్స్‌ గల షిగెల్లా వ్యాక్సిన్‌ ఏదీ లేదు. బ్యాక్టీరియా ద్వారా ఈ అతిసార వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అల్పాదాయ, మధ్యాదాయ దేశాలకు శాస్ర్తీయంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ కృష్ణ ఎల్లా అన్నారు.

ఇరు సంస్థల మధ్య కుదిరిన అంగీకారం ప్రకారం భారత్‌ బయోటెక్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించడం, నియంత్రణాపరమైన అనుమతులు సాధించడంతో పాటు భారీ ఎత్తున ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. క్లినికల్‌ ట్రయల్స్‌ డిజైనింగ్‌, తయారీ కార్యకలాపాల కోసం విదేశీ నిధుల సమీకరణ, వాణిజ్యీకరణ వ్యూహాలను జీఎ్‌సకే పర్యవేక్షిస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

వణికించిన టాప్ 10 విమాన ప్రమాదాలు..

ఎయిర్ ఇండియా ప్రమాదం ఫస్ట్ వీడియో

For National News And Telugu News

Updated Date - Jun 13 , 2025 | 05:09 AM