రూ 430కే మలేరియా వ్యాక్సిన్
ABN , Publish Date - Jun 26 , 2025 | 05:43 AM
మలేరియా వ్యాక్సిన్ మరింత మంది పిల్లలకు అందుబాటులోకి తేవాలని హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్, బహుళ జాతి ఫార్మా కంపెనీ...
చేతులు కలిపిన భారత్ బయోటెక్-జీఎ్‌సకే
న్యూఢిల్లీ: మలేరియా వ్యాక్సిన్ మరింత మంది పిల్లలకు అందుబాటులోకి తేవాలని హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్, బహుళ జాతి ఫార్మా కంపెనీ ‘జీఎ్‌సకే పీఎల్‌సీ’ నిర్ణయించాయి. ఇందుకోసం తాము అభివృద్ధి చేసి ఉత్పత్తి చేస్తున్న ‘ఆర్‌టీఎ్‌స-ఎస్’ వ్యాక్సిన్ ధరను 2028 నాటికి సగానికిపైగా తగ్గించనున్నట్టు ప్రకటించాయి. దీంతో మరో మూడేళ్లలో ఈ వ్యాక్సిన్ ఐదు డాలర్ల (పస్తుత మారకం రేటు ప్రకారం సుమారు రూ.430) కంటే తక్కువకే లభిస్తుందని తెలిపాయి. వ్యాక్సిన్ల తయారీ ప్రక్రియను మరింత మెరుగుపరచడం, ఉత్పత్తి సామర్ధ్య విస్తరణ, తయారీ ఖర్చులు తగ్గించుకోవడం, తక్కువ లాభాల ద్వారా తాము వ్యాక్సిన్ ధరను 2028 నాటికి సగానికిపైగా తగ్గించనున్నట్టు రెండు కంపెనీలు బుధవారం ప్రకటించాయి. పిల్లలకు మలేరియా రాకుండా ముందు జాగ్రత్తగా ఈ వ్యాక్సిన్లు వేస్తారు.
‘గవి’కి అండగా: ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో మలేరియా మహమ్మారి ఎక్కువగా ఉంది. ఏటా దాదాపు ఐదు లక్షల మంది పిల్లలు దీని బారిన పడి ప్రా ణాలు కోల్పోతున్నారు. దీంతో ఆఫ్రికా దేశాల్లోని పిల్లలకు చౌకగా మలేరియా వ్యాక్సిన్లు అందజేసేందుకు వ్యాక్సిన్ అలయెన్స్ (గవి) అనే స్వచ్ఛంద సంస్థ పని చేస్తోంది. ఈ సంస్థకు జీఎ్‌సకే వ్యాక్సిన్లు సరఫరా చేస్తోంది.
2021లోనే టై అప్
జీఎ్‌సకే, పాత్, మరికొన్ని ఫార్మా కంపెనీలు కలిసి ఈ ‘ఆర్‌టీఎ్‌స-ఎస్’ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) కూడా దీన్ని తొలి మలేరియా వ్యాక్సిన్‌గా ఆమోదించింది. జీఎ్‌సకే సంస్థ ఈ వ్యాక్సిన్ టెక్నాలజీని భారత్ బయోటెక్‌కు బదిలీ చేసి, వ్యాక్సిన్లు తయారు చేసి గవికి సరఫరా చేసేందుకు 2021లోనే ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఈ వ్యాక్సిన్ల తయారీ, మరింత అభివృద్ది కోసం భారత్ బయోటెక్ కూడా 20 కోట్ల డాలర్లకుపైగా ఖర్చు చేసింది. ‘ఈ చారిత్రాత్మక ప్రకటన ద్వారా కోట్లాది మంది పిల్లలు, వారి కుటుంబాలను మలేరియా భూతం నుంచి కాపాడబోతున్నాం’ అని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా తెలిపారు.
ఇవీ చదవండి:
1600 కోట్ల పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్‌లో లీక్.. హెచ్చరించిన గూగుల్
ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి