Share News

ప్రపంచ టాప్‌ 12 టెక్‌ కేంద్రాల్లో బెంగళూరు

ABN , Publish Date - May 28 , 2025 | 05:31 AM

బెంగళూరులో టెక్‌ నిపుణుల సంఖ్య 10 లక్షలు దాటింది. దీంతో ప్రపంచంలోని 12 అగ్రశ్రేణి టెక్నాలజీ కేంద్రాల్లో బెంగళూరు ఒకటిగా మారింది. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టింగ్‌ కంపెనీ సీబీఆర్‌ఈ ఒక...

ప్రపంచ టాప్‌ 12 టెక్‌ కేంద్రాల్లో బెంగళూరు

న్యూఢిల్లీ: బెంగళూరులో టెక్‌ నిపుణుల సంఖ్య 10 లక్షలు దాటింది. దీంతో ప్రపంచంలోని 12 అగ్రశ్రేణి టెక్నాలజీ కేంద్రాల్లో బెంగళూరు ఒకటిగా మారింది. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టింగ్‌ కంపెనీ సీబీఆర్‌ఈ ఒక నివేదికలో ఈ విషయం వెల్లడించింది. టెక్నాలజీ నిపుణుల లభ్యత, నాణ్యత, వ్యయాల ఆధారంగా టెక్నాలజీ కేంద్రాలను మూడుగా వర్గీకరించారు. పవర్‌హౌస్‌ (అత్యంత పోటీ సామర్థ్యం కలిగి ఉన్న 12 మార్కెట్లు), ఎస్టాబ్లిష్డ్‌ (ప్రతిభావంతులైన నిపుణులు నిలకడగా అందుబాటులో గల 63 పరిణతి చెందిన మార్కెట్లు), ఎమర్జింగ్‌ (సామర్థ్యాలు విస్తరించుకుంటున్న 40 వర్ధమాన మార్కెట్లు) ఈ వర్గీకరణలో ఉన్నాయి. ఇందులో పవర్‌హౌస్‌ విభాగంలో బెంగళూరు నిలిచింది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో టెక్నాలజీ నిపుణులు 10 లక్షలు దాటిన ఇతర నగరాలు బీజింగ్‌, షాంఘై మాత్రమేనని సీబీఆర్‌ఈ చైర్మన్‌ అన్షుమన్‌ మ్యాగజైన్‌ అన్నారు. డిజిటల్‌ ఇన్నోవేషన్‌, ఏఐ విభాగాల్లో భారతదేశ వ్యూహాత్మక స్థానానికి బెంగళూరు టాప్‌ 12లో చేరడం ఒక నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి:

నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం

వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 28 , 2025 | 05:31 AM