Share News

ఈక్విటీ మార్కెట్‌పై బేర్‌ పట్టు

ABN , Publish Date - Feb 27 , 2025 | 04:53 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ‘బేర్‌’మంటోంది. గత ఏడాది సెప్టెంబరు 27న సెన్సెక్స్‌ 85,978.25 పాయింట్లు, నిఫ్టీ 26,277.35 పాయింట్ల జీవిత కాల గరిష్ఠ స్థాయిని తాకి రికార్డులు సృష్టించాయి...

ఈక్విటీ మార్కెట్‌పై బేర్‌ పట్టు

6 నెలల్లో సూచీలు 14% డౌన్‌

  • రూ.82.51 లక్షల కోట్లు హాం ఫట్‌

  • రూ.లక్ష కోట్ల ఎఫ్‌పీఐల పెట్టుబడులు వెనక్కి

న్యూఢిల్లీ : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ‘బేర్‌’మంటోంది. గత ఏడాది సెప్టెంబరు 27న సెన్సెక్స్‌ 85,978.25 పాయింట్లు, నిఫ్టీ 26,277.35 పాయింట్ల జీవిత కాల గరిష్ఠ స్థాయిని తాకి రికార్డులు సృష్టించాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిఫ్టీ 3,729.8 పాయింట్లు (14.19 శాతం), సెన్సెక్స్‌ 11,376.13 పాయింట్లు (13.23 శాతం) నష్ట పోయాయి. దీంతో బీఎ్‌సఈలో లిస్టయిన కంపెనీల షేర్ల మార్కెట్‌ విలువ రూ.479 లక్షల కోట్ల నుంచి మంగళవారానికి రూ.396.49 లక్షల కోట్లకు చేరింది. అంటే మార్కెట్‌ విలువ రూ.82.51 లక్షల కోట్లు క్షీణించిందన్న మాట. గత రెండు నెలల కాలంలోనే ఎఫ్‌పీఐలు దాదాపు రూ.లక్ష కోట్ల పెట్టుబడులను మన మార్కెట్‌ నుంచి వెనక్కి తీసుకున్నాయి. ఈ కింది అంశాలు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ను షేక్‌ చేస్తున్నాయి.


  • వర్తమాన ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికం వృద్ధి రేటు 5.4 శాతానికి పడిపోవడం.

  • మన కంపెనీల షేర్లు అధిక ధరల వద్ద ట్రేడవడం.

  • ఎఫ్‌పీఐలు సెల్‌ ఇండియా, బై చైనా పాలసీని అనుసరించడం.

  • కంపెనీల డిసెంబరు త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం.

  • ట్రంప్‌ ఆర్థిక విధానాలతో పెరుగుతున్న వాణిజ్య యుద్ధ భయాలు.

  • ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి.

  • డాలర్‌తో బేర్‌ మంటున్న రూపాయి మారకం రేటు.

  • ద్రవ్యోల్బణం ఇంకా అధికంగానే ఉండడం.

  • అమెరికా రుణ పత్రాలపై అధిక వడ్డీ రేట్లు.

  • అమెరికా ఫెడ్‌ రిజర్వు వడ్డీ రేట్ల తగ్గింపులకు బ్రేక్‌ ఇస్తుందనే అంచనాలు.



ఇవి కూడా చదవండి:

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా చివరిరోజు నాగ సాధువుల డ్రోన్ విజువల్స్.. తర్వాత మేళా ఎక్కడంటే..


Ashwini Vaishnaw: మన దగ్గర హైపర్ లూప్ ప్రాజెక్ట్ .. 300 కి.మీ. దూరం 30 నిమిషాల్లోనే..


Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 27 , 2025 | 04:53 AM