Share News

BDMA India: చైనా బల్క్‌ డ్రగ్స్‌ను కట్టడి చేయాల్సిందే

ABN , Publish Date - Dec 17 , 2025 | 05:53 AM

చైనా నుంచి చౌకగా వచ్చిపడుతున్న బల్క్‌ డ్రగ్స్‌ దిగుమతులను అడ్డుకోవాలని దేశీయ బల్క్‌ డ్రగ్స్‌ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకోసం త్వరగా కనీస దిగుమతి ధర (ఎంఐపీ) విధానం...

BDMA India: చైనా బల్క్‌ డ్రగ్స్‌ను కట్టడి చేయాల్సిందే

ప్రభుత్వానికి బీడీఎంఏ వినతి

త్వరగా కనీస దిగుమతి ధర అమలు చేయండి

హైదరాబాద్‌: చైనా నుంచి చౌకగా వచ్చిపడుతున్న బల్క్‌ డ్రగ్స్‌ దిగుమతులను అడ్డుకోవాలని దేశీయ బల్క్‌ డ్రగ్స్‌ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకోసం త్వరగా కనీస దిగుమతి ధర (ఎంఐపీ) విధానం అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. లేకపోతే చౌకగా వచ్చిపడుతున్న చైనా బల్క్‌ డ్రగ్స్‌తో పోటీపడలేక దేశీయ బల్క్‌ డ్రగ్‌ కంపెనీలు మూతపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. చైనా ఇటీవల తన బల్క్‌ డ్రగ్స్‌ ధరలను భారీగా తగ్గించి అతి తక్కువ ధరకు భారత్‌ వంటి దేశాలకు పెద్దఎత్తున ఎగుమతి చేస్తోంది. దీంతో ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న దేశీయ బల్క్‌ డ్రగ్స్‌ కంపెనీలు అల్లాడి పోతున్నాయి. కీలకమైన యాంటీబయాటిక్స్‌ ఔషధాల్లో ఉపయోగించే పెన్సిలిన్‌ జీ వంటి బల్క్‌ డ్రగ్స్‌ విషయంలోనూ చైనా ఇదే పద్దతి అనుసరిస్తోంది. వీలైనంత త్వరగా ఎంఐపీ నిర్ణయిస్తే తప్ప, చైనా అడ్డగోలు ఎగుమతులకు చెక్‌ పెట్టేందుకు వీలుపడదని బల్క్‌ డ్రగ్స్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ (బీడీఎంఏ) స్పష్టం చేసింది. దీర్ఘకాలిక దేశ భద్రత దృష్ట్యా చూసినా ఇది అనివార్యమని పేర్కొంది. బల్క్‌ డ్రగ్స్‌ ఎంఐపీని ధరల స్థిరీకరణ చర్యగా చూడాలే తప్ప, వాణిజ్య రక్షణ చర్యగా చూడకూడదని తెలిపింది.

ఇవీ చదవండి:

అంటార్కిటికాలో జాబ్.. రూ.1.3 కోట్ల జీతం.. వెళ్లాలా? వద్దా? యువకుడి డైలమా!

జాబ్ పోగొట్టుకున్న యువతి.. పనివేళల కంటే ముందే ఉద్యోగానికి వెళ్లి..

Updated Date - Dec 17 , 2025 | 05:53 AM