Reliance Communications Fraud: ఆర్‌కామ్‌ది మోసపూరిత ఖాతానే బీఓబీ
ABN , Publish Date - Sep 06 , 2025 | 02:53 AM
దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) రుణ ఖాతాను బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) కూడా మోసపూరిత ఖాతాగా ప్రకటించింది. ఈ మోసంలో ఆ కంపెనీ...
న్యూఢిల్లీ: దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) రుణ ఖాతాను బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) కూడా మోసపూరిత ఖాతాగా ప్రకటించింది. ఈ మోసంలో ఆ కంపెనీ మాజీ డైరెక్టర్ అనిల్ అంబానీ కూడా దోషి అని రెగ్యులేటరీ సంస్థలకు బ్యాంక్ తెలిపింది. ఫోరెన్సిక్ ఆడిట్ ఆధారంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఆర్‌కామ్‌కు రెండు విడతలుగా తాము రూ.2,462.5 కోట్ల రుణాలు మంజూరు చేస్తే, అందు లో ఇప్పటికీ రూ.1,656.07 కోట్ల బకాయిలు చెల్లించలేదని పేర్కొంది. కాగా ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) ఇప్పటికే ఆర్‌కామ్ రుణ ఖాతాలను మోసపూరిత ఖాతాలుగా ప్రకటించాయి.
ఇవి కూడా చదవండి..
ఈడీ ముందుకు శిఖర్ ధవన్.. బెట్టింగ్ యాప్ కేసులో విచారణ..
కోహ్లీ పాస్.. లండన్‌లో టెస్ట్‌కు అనుమతి ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..