Bank Holidays in September 2025: బ్యాంక్ సిబ్బందికి గుడ్ న్యూస్.. కస్టమర్లకు..
ABN , Publish Date - Aug 31 , 2025 | 08:20 AM
బ్యాంకులకు సెలవులు వస్తుంటాయి. కానీ ఈ సెప్టెంబర్ మాసంలో బ్యాంకులకు భారీగా సెలవులు వచ్చాయి. అది కూడా సగానికి సగం రోజులు సెలవు దినాలు కావడంతో.. బ్యాంక్ సిబ్బంది జాక్ పాట్ కొట్టినట్లే.
Bank Holidays in September 2025: వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రతి నెలా బ్యాంకు సెలవులను ముందుగానే ప్రకటిస్తుంది. అందులో భాగంగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన సెలవుల జాబితాను సైతం తాజాగా విడుదల చేసింది. ఈ నెలలో పండగలు, వారాంతాలతో కలిపి సగం రోజులు.. అంటే 15 రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. అయితే ప్రాంతీయ వేడుకలు, పండగల ప్రకారం సెలవులను ఆర్‌బీఐ నిర్ణయిస్తున్న సంగతి తెలిసిందే. ఇక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు పబ్లిక్ హలీడేస్ మాత్రం కామన్‌గా ఉన్నాయి.
సెప్టెంబర్ నెలలో బ్యాంకు సెలవుల జాబితా ఈ విధంగా ఉంది..
సెప్టెంబర్ 3 (బుధవారం): కర్మ పూజ సందర్భంగా జార్ఖండ్, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్ 4 (గురువారం): కేరళలోని ఓనం పండగ సందర్భంగా కొచ్చి, తిరువనంతపురంలోని బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్ 5 (శుక్రవారం): మిలాద్ ఉన్ నబీ సందర్భంగా అహ్మదాబాద్, ఐజాల్,బేలాపూర్, బెంగళూరు, భోపాల్, చెన్నై, డెహ్రాడూన్, హైదరాబాద్, ఇంపాల్, కాన్పూర్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, రాంచీ, శ్రీనగర్, తిరువనంతపురం, విజయవాడలోని బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్ 6 (శనివారం): ఇంద్రజాత్ర సందర్భంగా జమ్ము, శ్రీనగర్, రాయ్‌పూర్, సిక్కింలలో బ్యాంకులు పని చేయవు.
సెప్టెంబర్ 7 (ఆదివారం): అందరికి సెలవు దినం.
సెప్టెంబర్ 12 (శుక్రవారం): ఈద్ ఇ మిలాద్ ఉల్ నబీ సందర్భంగా జమ్ము, శ్రీనగర్‌లలో బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్ 13 (శనివారం): రెండో శనివారం
సెప్టెంబర్ 14( ఆదివారం): అందరికి సెలవు దినం.
సెప్టెంబర్ 21: ఆదివారం): అందరికి సెలవు దినం.
సెప్టెంబర్ 22 (సోమవారం): నవరాత్రి స్థాపన సందర్భంగా రాజస్థాన్‌లోని బ్యాంకులకు సెలవు దినం.
సెప్టెంబర్ 23 (మంగళవారం): మహారాజా హరిసింగ్ జీ జన్మదినం సందర్భంగా జమ్ము, శ్రీనగర్‌లోని బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్ 27 (శనివారం): నాలుగో శనివారం
సెప్టెంబర్ 28 (ఆదివారం):అందరికి సెలవు దినం.
సెప్టెంబర్ 29( సోమవారం): మహా సప్తమి/ దుర్గాపూజ సందర్భంగా త్రిపుర, అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్ 30 (మంగళవారం) : మహాఅష్టమి/ దుర్గాష్టమి/దుర్గా పూజ సందర్భంగా త్రిపుర, ఒడిశా, అసోం, మణిపూర్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.
ఇవి కూడా చదవండి
భారత్, చైనా శత్రవులు కాదు.. ఏనుగు, డ్రాగన్ కలిసి నాట్యం చేయాలి: జిన్‌పింగ్
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏమైందంటే..