బజాజ్ ఫైనాన్స్ 4:1 బోనస్ షేర్ల జారీ
ABN , Publish Date - Apr 30 , 2025 | 05:43 AM
గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి (క్యూ4) బజాజ్ ఫైనాన్స్ రూ.3,940 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో...
క్యూ4 లాభం రూ.3,940 కోట్లు.. ఒక్కో షేరుపై రూ.44 డివిడెండ్
న్యూఢిల్లీ: గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి (క్యూ4) బజాజ్ ఫైనాన్స్ రూ.3,940 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 16 శాతం ఎక్కువ. ఇదే సమయంలో ఆదాయం రూ.12,764 కోట్ల నుంచి రూ.15,808 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం రూ.11,201 కోట్ల నుంచి రూ.13,824 కోట్లకు చేరింది.
వాటాదారులకు బొనాంజా: ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో కంపెనీ వాటాదారులకూ తీపికబురు చెప్పింది. ఒక్కోటి రూ.2 ముఖ విలువ ఉన్న కంపెనీ షేర్లపై రూ.44 చొప్పున తుది డివిడెండ్ చెల్లించాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. దీంతో పాటు రూ.12 ప్రత్యేక డివిడెండ్‌ను కంపెనీ అందించనుంది. అలాగే ఒక్కోటి రూ.2 ముఖ విలువతో కూడిన షేరును రూ.1 ముఖ విలువతో కూడిన రెండు షేర్లుగా విభజించేందుకు ఆమోదం తెలిపింది. మళ్లీ ఈ రూ.1 ముఖ విలువ ఉండే ఒక్కో షేరుకు నాలుగు చొప్పున (4ః1) బోనస్ షేర్లు జారీ చేసేందుకూ బజాజ్ ఫైనాన్స్ బోర్డు ఆమోదం తెలిపింది.
ఇవి కూడా చదవండి
Live In Partner: పదేళ్ల సహజీవనం.. బెడ్డు కింద ప్రియురాలి శవం..
అడిగినంత పనీర్ వేయలేదని పెళ్లి మండపంలో దారుణం..