Share News

ATM Cash Stuck: ఏటీఎమ్ మెషీన్‌లో డబ్బు ఇరుక్కుపోయినప్పుడు ఏం చేయాలంటే..

ABN , Publish Date - Sep 16 , 2025 | 10:18 AM

డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు వెళ్లిన వారు ఒక్కోసారి ఏటీఎమ్ మెషీన్‌లో కరెన్సీ నోట్లు ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటప్పుడు ఏం చేయాలనేదానిపై నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ATM Cash Stuck: ఏటీఎమ్ మెషీన్‌లో డబ్బు ఇరుక్కుపోయినప్పుడు ఏం చేయాలంటే..
ATM cash stuck

ఇంటర్నెట్ డెస్క్: ఏటీఎమ్‌లో డబ్బు ఇరుక్కుపోవడమనే సమస్యను చాలా మంది ఏదోక సందర్భంలో ఎదుర్కొనే ఉంటారు. సాంకేతిక సమస్య లేదా ఇతర కారణాల వల్ల అప్పుడప్పుడూ ఇలా జరిగే అవకాశం ఉంది. ఇలా ఇరుక్కున్న డబ్బును బయటకు లాగడం కష్టంగా మారుతుంది. దీంతో, ఏం చేయాలో పాలుపోక జనాలు తెగ ఇబ్బంది పడుతుంటారు. కొన్ని సందర్భాల్లో విత్‌డ్రా చేసుకున్న డబ్బులో కొంత మొత్తాన్ని మెషీన్‌‌లు ఇస్తుంటాయి. మిగతాది లోపలే ఇరుక్కుపోతుంటుంది. సర్వర్ సమస్యలో లేదా ఏటీఎమ్‌లో సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు ఇలా జరుగుతుంటుంది. అయితే, ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అనుభవజ్ఞులు చెబుతున్నారు (ATM cash stuck).

నిపుణులు చెప్పే దాని ప్రకారం, ఏటీఎమ్‌లో నోట్లు ఇరుక్కుపోయినప్పుడు వాటిని బలవంతంగా బయటకు లాగే ప్రయత్నం చేయకూడదు. నోట్లు వాటంతట అవే బయటకు వస్తాయేమో వేచి చూడాలి. రెండు మూడు నిమిషాలు ఆగాలి. చాలా సందర్భాల్లో కొన్ని నిమిషాల తరువాత కెరెన్సీ నోట్లు వాటంతట అవే బయటకు వస్తాయి. కాబట్టి, టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండాలి. నోట్లు బయటకు రాని పక్షంలో బ్యాంకులు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినట్టుగా పరిగణించి డబ్బును మళ్లీ కస్టమర్ అకౌంట్‌కు 24 గంటల్లో బదిలీ చేస్తాయి. అకౌంట్‌లో డబ్బు కట్ అయినా మెషీన్ నుంచి నోట్లు బయటకు రాని సందర్భాల్లో ముందుగా ట్రాన్సాక్షన్ రిసీట్‌ను జాగ్రత్తగా పెట్టుకోవాలి (ATM transaction fails refund).


రిసీట్ లేని సందర్భాల్లో బ్యాంకు నుంచి వచ్చే ఎస్ఎమ్ఎస్ లేదా బ్యాంట్ స్టేట్‌మెంట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిన 24 గంటల్లోపు డబ్బు అకౌంట్‌లో పడకపోతే వెంటనే బ్యాంకు కస్టమర్ సర్వీసును సంప్రదించాలి. ఏటీఎమ్ లొకేషన్, అది ఏ బ్యాంకుకు చెందినదీ, విత్ డ్రా చేసిన తేదీ, సమయం, ట్రాన్సాక్షన్ ఐడీ వంటి వివరాలు ఇవ్వాలి.

డబ్బు ఇలా ఇరుక్కుపోయిన సందర్భాల్లో ఏటీఎమ్ మెషీన్ మానిటర్ స్క్రీన్‌‌పై ఉన్న మెసేజ్‌ను ఫొటో తీసుకోవాలని కూడా అనుభవజ్ఞులు చెబుతున్నారు. ఇక కస్టమర్ కేర్ ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే వెంటనే సమీపంలోని బ్యాంకు బ్రాంచ్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. బ్యాంకు అధికారిక వెబ్ సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఇలాంటప్పుడు కంప్లెయింట్ నెంబర్‌ను గుర్తుంచుకోవాలి. నిపుణులు చెప్పేదాని ప్రకారం, ఇలాంటి సమస్యలన్నీ గరిష్టంగా 10 రోజుల్లోపు పరిష్కారం అవుతాయి (what to do cash not dispensed ATM).

సమస్యలు ఎదురైనప్పుడు ఏటీఎమ్‌‌ను సొంతంగా రిపేర్ చేసే ప్రయత్నం చట్ట విరుద్ధమన్న విషయం అస్సలు మర్చిపోకూడదు. ఇక ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం, బ్యాంకులు ఈ ఫిర్యాదులను గరిష్ఠంగా 45 రోజుల్లోపు పరిష్కరించాలి. లేని పక్షంలో కస్టమర్లకు తాము నష్టపోయిన మొత్తంతో పాటు వడ్డీ కూడా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.


ఇవి కూడా చదవండి

మిడిల్ క్లాస్ జీవులు కచ్చితంగా పాటించాల్సిన 10 ఆర్థిక సూత్రాలు!

గుడ్ న్యూస్, ఐటీఆర్ గడువు పొడిగింపు..ఎప్పటివరకు ఉందంటే..

Read Latest and Business News

Updated Date - Sep 16 , 2025 | 10:59 AM