Share News

ఇస్రోకు ఏటీఎల్‌, ఎంటార్‌ కీలక పరికరాలు

ABN , Publish Date - Jan 30 , 2025 | 02:29 AM

బుధవారం మన దేశం ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన ఎన్‌వీఎ్‌స-02 ఉపగ్రహ విజయంలో హైదరాబాద్‌కు చెందిన అనంత్‌ టెక్నాలజీస్‌...

ఇస్రోకు ఏటీఎల్‌, ఎంటార్‌ కీలక పరికరాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): బుధవారం మన దేశం ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన ఎన్‌వీఎ్‌స-02 ఉపగ్రహ విజయంలో హైదరాబాద్‌కు చెందిన అనంత్‌ టెక్నాలజీస్‌, ఎంటార్‌ టెక్నాలజీస్‌ కీలక పాత్ర పోషించాయి. ఇస్రో 100వ ఉపగ్రహ ప్రయోగం ఒక చారిత్రక విజయమని, ఆ విజయంలో తాము కూడా భాగస్వాములు కావడం ఆనందదాయకమని రెండు సంస్థలు ప్రకటించాయి. ఈ రెండు సంస్థలు ఎన్‌వీఎ్‌స-02 ఉపగ్రహానికి, జీఎ్‌సఎల్‌వీ ఎఫ్‌ 15 రాకెట్‌కు కీలకమైన భాగాలు సరఫరా చేశాయి.


అనంత్‌ టెక్నాలజీస్‌: ఈ సంస్థ ఎన్‌వీఎ్‌స-02 ఉపగ్రహానికి ఆల్టిట్యూడ్‌, ఆర్బిట్‌ కంట్రోల్‌ ఎలక్ర్టానిక్స్‌, డీసీ-డీసీ కన్వర్టర్‌తో కూడిన స్టార్‌ సెన్సర్‌ మార్క్‌-3 సరఫరా చేసింది. అలాగే జీఎ్‌సఎల్‌వీ ఎఫ్‌ 15 రాకెట్‌కు డేటా ఎక్విజిషన్‌ యూనిట్లు, ట్రాన్స్‌పౌండర్లు, పవర్‌ మాడ్యూల్స్‌, రిలే యూనిట్లు, కంట్రోల్‌ మాడ్యూళ్లు సహా 40 కీలక వ్యవస్థలు సరఫరా చేసినట్టు కంపెనీ సీఎండీ డాక్టర్‌ పావులూరి సుబ్బారావు తెలిపారు. తమ సంస్థ ఇప్పటివరకు 103 ఉపగ్రహాలు, 83 ప్రయోగవాహక రాకెట్లకు కీలక భాగాలు సమకూర్చి ఇస్రో విజయాల్లో కీలక పాత్ర పోషించిందన్నారు.


ఎంటార్‌ టెక్నాలజీస్‌: ప్రెసిషన్‌ ఇంజినీరింగ్‌లో అందె వేసిన చేయిగా పేరొందిన ఎంటార్‌ టెక్నాలజీస్‌ జీఎ్‌సఎల్‌వీ రాకెట్‌కు వికాస్‌ ఇంజిన్లు, క్రయోజెనిక్‌ అప్పర్‌ స్టేజ్‌ వ్యవస్థలు, ఎలక్ర్టో న్యూమాటిక్‌ మాడ్యూల్స్‌ సరఫరా చేసినట్టు కంపెనీ ఎండీ పర్వత్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ పరికరాలన్నీ రాకెట్‌ స్థిరత్వానికి, నిలకడగా పని చేయడానికి కీలకంగా నిలిచాయని తెలిపారు. దేశీయంగా ఉత్పత్తి చేసిన పరికరాలతో పాటు విదేశాల నుంచి సేకరించిన ఆటమిక్‌ గడియారాలు కచ్చితమైన కాలాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడ్డాయన్నారు.


ఇవి కూడా చదవండి:

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..


IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..


Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 30 , 2025 | 02:29 AM