Aram Launches Safe Deposit Lockers: గేటెడ్ కమ్యూనిటీల్లో సేఫ్ డిపాజిట్ లాకర్లు
ABN , Publish Date - Oct 08 , 2025 | 06:19 AM
ప్రైవేట్ సేఫ్ డిపాజిట్ లాకర్ ప్రొవైడర్ ఆరమ్.. హైదరాబాద్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. హైదరాబాద్‌లోని రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీస్ అయిన సత్వ మాగ్నస్, అపర్ణ సరోవర్ గ్రాండేలో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రైవేట్ సేఫ్ డిపాజిట్ లాకర్ ప్రొవైడర్ ఆరమ్.. హైదరాబాద్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. హైదరాబాద్‌లోని రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీస్ అయిన సత్వ మాగ్నస్, అపర్ణ సరోవర్ గ్రాండేలో టెక్ ఆధారిత సేఫ్ డిపాజిట్ లాకర్లను ఏర్పాటు చేసినట్లు ఆరమ్ ఫౌండర్, సీఈఓ విజయ్ అరిశెట్టి తెలిపారు. మిలిటరీ గ్రేడ్ సెక్యూరిటీ సిస్టమ్, ఆటోమేటెడ్‌తో కూడిన ఈ బయో మెట్రిక్ ఆధారిత లాకర్లు రోజంతా అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు. అంతేకాకుండా ప్రతి లాకర్‌కు రూ.కోటి వరకు ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ఐసీఐసీఐ లొంబార్డ్, టాటా ఏఐజీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు విజయ్ తెలిపారు. ఆరమ్ ఇప్పటికే బెంగళూరు, విశాఖపట్నంలో కార్యకలాపాలు సాగిస్తోందన్నారు. ప్రస్తుతం 21 సైట్స్‌లో మొత్తం 18,000 లాకర్లను నిర్వహిస్తుండగా వచ్చే ఏడాది నాటికి మరో 50 సైట్లలో 10,000 లాకర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. లాకర్ సైజును బట్టి అద్దె రూ.8,000 నుంచి రూ.25,000 వరకు ఉన్నాయని విజయ్ తెలిపారు.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి