భారత్ నుంచి అమెరికాకు 600 టన్నుల ఐఫోన్ల తరలింపు
ABN , Publish Date - Apr 11 , 2025 | 05:58 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల భారాన్ని తప్పించుకునేందుకు టెక్నాలజీ దిగ్గజం యాపిల్ హుటాహుటిన చర్యలు చేపట్టింది. సుంకాలు...

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల భారాన్ని తప్పించుకునేందుకు టెక్నాలజీ దిగ్గజం యాపిల్ హుటాహుటిన చర్యలు చేపట్టింది. సుంకాలు అమల్లోకి రాకముందే భారత్ నుంచి అమెరికాకు 6 కార్గో విమానాల ద్వారా 600 టన్నుల బరువున్న 15 లక్షల ఐఫోన్లను తరలించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం భారత్‌లోని యాపిల్ థర్డ్ పార్టీ వెండార్ల ప్లాంట్లలో ఉత్పత్తిని అమాంతం పెంచిం ది. విమానాల ద్వారా సరుకు రావాణాకు కస్టమ్స్ అనుమతులు అవసరం. ఇందుకు సాధారణంగా పట్టే 30 గంటల సమయాన్ని 6 గంటలకు తగ్గించాలని భారత ఎయిర్‌పోర్ట్ అధికారులతోనూ యాపిల్ లాబీయింగ్ జరిపినట్లు తెలిసింది. చెన్నై ఎయిర్‌పోర్ట్ ద్వారా కంపెనీ ఐఫోన్లను అమెరికాకు తరలించింది.
ఇవి కూడా చదవండి:
సీఎస్‌కేలో కీలక పరిణామం.. రుతురాజ్ స్థానంలో ధోనీ
రండి చూస్కుందాం.. గిల్ వార్నింగ్
ఒలింపిక్స్‌లో క్రికెట్.. ఆ జట్లకే చాన్స్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి