Apollo Hospitals: 2027 మార్చి కల్లా పునర్ వ్యవస్థీకరణ పూర్తి
ABN , Publish Date - Nov 10 , 2025 | 05:22 AM
అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ తన వ్యాపారాల పునర్ వ్యవస్థీకరణ వేగం పెంచింది. 2027 మార్చి నాటికి ఈ కార్యక్రమం పూర్తవుతుందని కంపెనీ సీఎ్‌ఫఓ కృష్ణన్ అఖిలేశ్వరన్ చెప్పారు....
అపోలో హాస్పిటల్స్
న్యూఢిల్లీ: అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ తన వ్యాపారాల పునర్ వ్యవస్థీకరణ వేగం పెంచింది. 2027 మార్చి నాటికి ఈ కార్యక్రమం పూర్తవుతుందని కంపెనీ సీఎ్‌ఫఓ కృష్ణన్ అఖిలేశ్వరన్ చెప్పారు. ఈ పునర్ వ్యవస్థీకరణ ద్వారా కంపెనీ తన ఫార్మసీ, డిజిటల్ వ్యాపారాలను ప్రత్యేక కంపెనీలుగా విభజించి.. ఆ కంపెనీలను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలని యోచిస్తోంది. ఇందుకు సెబీతో సహా ఇతర రెగ్యులేటరీ సంస్థల అనుమతులు అవసరం. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి కల్లా ఇవన్నీ పూర్తవుతాయని భావిస్తున్నట్టు అఖిలేశ్వరన్ తెలిపారు.
కోటక్ మహీంద్రా ఏఎంసీ.. కోటక్ రూరల్ ఆపర్చునిటీస్ ఫండ్‌ను ప్రారంభించింది. రూరల్, అల్లైడ్ థీమ్‌తో రూపొందించిన ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం ఇది. ఈ ఫండ్‌కు నిఫ్టీ రూరల్ ఇండెక్స్ బెంచ్‌మార్క్‌గా ఉండనుంది. కనీస పెట్టుబడి రూ.1,000. సిప్ రూపంలో అయితే రూ.500. ముగింపు తేదీ ఈ నెల 20.
ఇవి కూడా చదవండి:
పాక్ ఆర్మీ చీఫ్‌కు లబ్ధి చేకూర్చే రాజ్యాంగ సవరణ.. భగ్గుమన్న ప్రతిపక్షాలు
ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి