Apollo Hospitals Q1 Profit: అపోలో లాభం రూ 433 కోట్లు
ABN , Publish Date - Aug 13 , 2025 | 01:39 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కన్సాలిడేటెడ్ నికర లాభం 42 శాతం వృద్ధి చెంది రూ.433 కోట్లకు చేరుకుంది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కన్సాలిడేటెడ్ నికర లాభం 42 శాతం వృద్ధి చెంది రూ.433 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.305 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం రెవెన్యూ కూడా 15 శాతం వృద్ధితో రూ.5,086 కోట్ల నుంచి రూ.5,842. కోట్లకు పెరిగింది. కీలకమైన హెల్త్‌కేర్ సర్వీసులు, డయాగ్నోస్టిక్స్, డిజిటల్ హెల్త్ వ్యాపారాలు మంచి పనితీరును కనబరచటం ఎంతగానో కలిసి వచ్చిందని అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి