Apollo Hospitals: అపోలో హాస్పిటల్స్ చేతికి అపోలో హెల్త్
ABN , Publish Date - Sep 13 , 2025 | 03:12 AM
అపోలో హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్ (ఏహెచ్‌ఎల్‌ఎల్) పూర్తి స్థాయి లో అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్‌ఈఎల్) అనుబంధ సంస్థ కానుంది. ఇందుకోసం...
ఐఎ్‌ఫసీ నుంచి 31 శాతం వాటా కొనుగోలు
డీల్ విలువ రూ.1,254 కోట్లు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అపోలో హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్ (ఏహెచ్‌ఎల్‌ఎల్) పూర్తి స్థాయి లో అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్‌ఈఎల్) అనుబంధ సంస్థ కానుంది. ఇందుకోసం ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎ్‌ఫసీ) చేతిలో ఉన్న 31 శాతం వాటాను ఏహెచ్‌ఈఎల్ రూ.1,254.07 కోట్లకు కొనుగోలు చేయనుంది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఏహెచ్‌ఈఎల్ డైరెక్టర్ల బోర్డు ఈ షేర్ల కొనుగోలు ఒప్పందానికి ఆమోదం తెలిపింది. దీంతో ఏహెచ్‌ఎల్‌ఎల్ ఈక్విటీలో ఏహెచ్‌ఈల్ వాటా 99.42 శాతానికి చేరుతుంది. మిగతా 0.58 శాతం షేర్లు ఈ-సాప్స్ కింద ఉద్యోగుల వద్ద ఉంటాయి. ఏహెచ్‌ఎల్‌ఎల్ కార్యకాపాలపై పూర్తి నియంత్రణ, యాజమాన్యం కోసం ఐఎ్‌ఫసీ నుంచి ఈ వాటాలను కొనుగోలు చేస్తున్నట్టు ఏహెచ్‌ఈఎల్ రెగ్యులేటరీ సంస్థలకు తెలిపింది. దీనివల్ల ఏహెచ్‌ఎల్‌ఎల్ నిర్వహణ సామర్ధ్యం మరింత మెరుగుపడడంతో పాటు, ఆ సంస్థ వ్యాధి నిర్ధారణ సేవలను ఏహెచ్‌ఈఎల్‌తో పూర్తి స్థాయిలో అనుసంధానించేందుకు వీలవుతుందని పేర్కొంది. ఈ చర్య అపోలో గ్రూప్ సమగ్ర ఆరోగ్య సేవలకు మరింత విలువ జోడిస్తుందని అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ ఎండీ సునీతా రెడ్డి తెలిపారు. ఏహెచ్‌ఎల్‌ఎల్‌పై పూర్తి పట్టు ద్వారా ఆ కంపెనీకి చెందిన ప్రాథమిక ఆరోగ్య, వ్యాధి నిర్ధారణ సేవలు, మహిళల ఆరోగ్యం, డెంటల్, డయాలసిస్, అంబులెన్స్ సేవలను మరింత ముందుకు తీసుకు వెళతామని ఏహెచ్‌ఈఎల్ జాయింట్ ఎండీ సంగీతా రెడ్డి తెలిపారు.
గురుగ్రామ్‌లో క్యాన్సర్ కేర్ సెంటర్: గురుగ్రామ్‌లో రూ.573 కోట్ల పెట్టుబడితో అదనంగా సమగ్ర క్యాన్సర్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసేందుకూ ఏహెచ్‌ఈఎల్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ కేంద్రం ద్వారా ఏటా అదనంగా 350 రోగులకు వైద్య సేవలు అందించవచ్చు. 2029 మార్చి నాటికి ఈ కేంద్రం ఏర్పాటు పూర్తవుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్.. మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్
లాకర్ తాళాల కోసం చిత్ర హింసలు పెట్టి..
Read Latest Telangana News and National News