Share News

Apollo Defense: అపోలో డిఫెన్స్‌ చేతికి ఐడీఎల్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌

ABN , Publish Date - May 03 , 2025 | 05:25 AM

హైదరాబాద్‌లో అపోలో డిఫెన్స్‌ ఐడీఎల్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ను రూ.107 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది రక్షణ రంగం కోసం పేలుడు పదార్ధాల తయారీలో కీలకమైన ప్రగతి.

Apollo Defense: అపోలో డిఫెన్స్‌ చేతికి ఐడీఎల్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌

  • డీల్‌ విలువ రూ.107 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కార్పొరేట్‌ ప్రపంచంలో మరో టేకోవర్‌ చోటు చేసుకుంది. హిందుజా గ్రూప్‌ కంపెనీ ఐడీఎల్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ లిమిటెడ్‌ను అపోలో మైక్రోసిస్టమ్స్‌ అనుబంధ సంస్థ అపోలో డిఫెన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏడీఐపీఎల్‌) రూ.107 కోట్లకు కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి శుక్రవారం రెండు సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అవసరమైన అన్ని అనుమతులు లభిస్తే రెండు మూడు నెలల్లో ఈ కొనుగోలు పూర్తవుతుందని అపోలో మైక్రోసిస్టమ్స్‌ తెలిపింది. ఐడీఎల్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌.. గనులు, వివిధ పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించే పేలుడు పదార్ధాల తయారీలో ఉంది. రక్షణ రంగానికి అవసరమైన పేలుడు, మందుగుండు సామాగ్రి తయారీలో ఉన్న అపోలో డిఫెన్స్‌కు ఈ కొనుగోలు ఎంతగానో తోడ్పడుతుందని భావిస్తున్నారు.

Updated Date - May 03 , 2025 | 05:26 AM