Share News

అమితవ ముఖర్జీ చేతికే ఎన్‌ఎండీసీ పగ్గాలు

ABN , Publish Date - Mar 07 , 2025 | 06:41 AM

ప్రభుత్వ రంగంలోని ఎన్‌ఎండీసీ కొత్త చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా అమితవ ముఖర్జీ నియమితులయ్యా రు. ప్రస్తుతం...

అమితవ ముఖర్జీ చేతికే ఎన్‌ఎండీసీ పగ్గాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రభుత్వ రంగంలోని ఎన్‌ఎండీసీ కొత్త చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా అమితవ ముఖర్జీ నియమితులయ్యా రు. ప్రస్తుతం ఆయన సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2028 ఫిబ్రవరి 29వ తేదీ వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఆ పదవిలో ఉంటా రు. 2018 నవంబరులో ఎన్‌ఎండీసీలో డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)గా చేరిన ఆయన 2023 మార్చి నుంచి సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా ఎన్‌ఎండీసీతో పాటు ఎన్‌ఎండీసీ స్టీల్‌, లెగసీ ఐరన్‌ ఓర్‌ లిమిటెడ్‌కు ముఖర్జీ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 07 , 2025 | 06:41 AM