Share News

Amara Raja Energy: తగ్గిన అమరరాజా లాభం

ABN , Publish Date - Aug 15 , 2025 | 01:34 AM

అమరరాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ లిమిటెడ్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో రూ.164.8 కోట్ల కన్సాలిడేటెడ్‌ లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో...

Amara Raja Energy: తగ్గిన అమరరాజా లాభం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అమరరాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ లిమిటెడ్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో రూ.164.8 కోట్ల కన్సాలిడేటెడ్‌ లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ.249.12 కోట్లతో పోల్చితే లాభం 33 శాతం తగ్గింది. అధిక వ్యయాలే లాభాల క్షీణతకు కారణమని కంపెనీ తెలిపింది. సమీక్షా త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ఆదాయం రూ.3,263.05 కోట్ల నుంచి రూ.3,401.08 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.2,957.93 కోట్ల నుంచి రూ.3,190.66 కోట్లకు పెరిగాయి. ఉత్పత్తిలో వినియోగించిన వస్తువు ల వ్యయాలు రూ.1,692.77 కోట్ల నుంచి రూ.1,800.68 పెరిగినట్టు కంపెనీ వెల్లడించింది. సమీక్షా కాలంలో లెడ్‌ యాసిడ్‌ బ్యాటరీలు, అనుబంధ ఉత్పత్తుల విభాగం రూ.3,279.79 కోట్లు, న్యూ ఎనర్జీ విభాగం రూ.121.29 కోట్ల ఆదాయం ఆర్జించాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్..

సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 15 , 2025 | 01:34 AM