Share News

రోటెర్‌డ్యామ్‌ పోర్టుతో ఏఎం గ్రీన్‌ ఒప్పందం

ABN , Publish Date - May 27 , 2025 | 02:50 AM

ఏఎం గ్రీన్‌ పెద్ద ఎత్తున యూరప్‌ దేశాలకు గ్రీన్‌ అమ్మోనియా ఎగుమతులకు సిద్ధమవుతోంది. ఇందుకోసం రోటెర్‌డ్యామ్‌ పోర్టుతో ఒక అవగాహనా ఒప్పదం (ఎంఓయూ) కుదుర్చుకుంది...

రోటెర్‌డ్యామ్‌ పోర్టుతో ఏఎం గ్రీన్‌ ఒప్పందం

భారత-యూరప్‌ మధ్య గ్రీన్‌ ఫ్యూయల్‌ కారిడార్‌

న్యూఢిల్లీ: ఏఎం గ్రీన్‌ పెద్ద ఎత్తున యూరప్‌ దేశాలకు గ్రీన్‌ అమ్మోనియా ఎగుమతులకు సిద్ధమవుతోంది. ఇందుకోసం రోటెర్‌డ్యామ్‌ పోర్టుతో ఒక అవగాహనా ఒప్పదం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఏటా దాదాపు 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.8,500 కోట్లు) విలువైన 10 లక్షల టన్నుల హరిత అమ్మోనియా, హైడ్రోజన్‌ యూర్‌పకు ఎగుమతి చేసేందుకు వీలవుతుంది. రోటెర్‌డ్యామ్‌ రేవు అధికారులు ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. ఈ ఒప్పందం ప్రకారం ఏఎం గ్రీన్‌ కంపెనీ యూరప్‌ వాయువ్య ప్రాంతంలోని కంపెనీలకు అవసరమైన హరిత నౌకా, విమాన ఇంధనాలు సరఫరా చేస్తుంది.

కాకినాడ ప్లాంటు: వచ్చే ఏడాది ద్వితీయార్ధానికల్లా కాకినాడ ప్లాంటులో హరిత అమ్మోనియా, హైడ్రోజెన్‌ ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఏఎం గ్రీన్‌ ప్రకటించింది. దాదాపు రూ.12,500 కోట్ల పెట్టుబడితో కంపెనీ ఈ ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. ఇందులో తొలి దశలో ఏటా 10 లక్షల టన్నుల హరిత అమ్మోనియా ఉత్పత్తి చేస్తారు. ఈ మొత్తాన్ని దిగుమతి చేసుకునేందుకు యూర్‌పనకు చెందిన వివిధ కంపెనీలు ఇప్పటికే ఏఎం గ్రీన్‌ కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

ఇవీ చదవండి:

నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం

వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 27 , 2025 | 02:50 AM