Share News

AM Green Partners with Mitsui: మిట్సుయితో ఏఎం గ్రీన్‌ జట్టు

ABN , Publish Date - Dec 19 , 2025 | 03:14 AM

ఇంధన పరివర్తన రంగంలో పెట్టుబడి అవకాశాలతో పాటు వ్యూహాత్మక సహకార అవసరాల అన్వేషణ కోసం జపాన్‌కు చెందిన మిట్సుయి అండ్‌ కోతో ఏఎం గ్రీన్‌ అవగాహనా...

AM Green Partners with Mitsui: మిట్సుయితో ఏఎం గ్రీన్‌ జట్టు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఇంధన పరివర్తన రంగంలో పెట్టుబడి అవకాశాలతో పాటు వ్యూహాత్మక సహకార అవసరాల అన్వేషణ కోసం జపాన్‌కు చెందిన మిట్సుయి అండ్‌ కోతో ఏఎం గ్రీన్‌ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద ఏఎం గ్రీన్‌ అనుబంధ సంస్థ ఏఎం గ్రీన్‌ అల్యూమినియం మెటల్స్‌ అండ్‌ మెటీరియల్స్‌ అభివృద్ధి చేస్తున్న ఇంటిగ్రేటెడ్‌ గ్రీన్‌ అల్యూమినియం ప్లాట్‌ఫామ్‌ విలువ ఆధారిత వ్యవస్థలో ఈక్విటీ ఫండింగ్‌ అవకాశాలను మిట్సుయి మదింపు చేస్తుందని ఉభయ సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ సహకారం ప్రపంచంలోనే తొలి సమీకృత గ్రీన్‌ అల్యూమినియం ఉత్పత్తి కేంద్రానికి అవసరమయ్యే ఈక్విటీ ఫండింగ్‌ మద్దతుకు భరోసా ఇస్తుందని పేర్కొన్నాయి. ఏడాదికి 10 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల గ్రీన్‌ అల్యూమినియం కాంప్లెక్స్‌ ఏర్పాటుకు సంబంధించి నవంబరు నెలలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ఏఎం గ్రీన్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అల్యూమినా రిఫైనరీ, అల్యూమినియం స్మెల్టర్లు పూర్తిగా పునరుత్పాదక ఇంధనంతోనే పని చేస్తాయి.

Also Read:

జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి

ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?

For More Latest News

Updated Date - Dec 19 , 2025 | 03:15 AM