Share News

ఎయిర్‌టెల్‌ లాభం ఐదింతలు

ABN , Publish Date - Feb 07 , 2025 | 01:31 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో భారతి ఎయిర్‌టెల్‌ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన ఐదింతలకు పైగా పెరిగి రూ.16,134.6 కోట్లకు...

ఎయిర్‌టెల్‌ లాభం ఐదింతలు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో భారతి ఎయిర్‌టెల్‌ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన ఐదింతలకు పైగా పెరిగి రూ.16,134.6 కోట్లకు చేరుకుంది. మొబైల్‌ టవర్ల నిర్వహణ కంపెనీ ఇండస్‌ టవర్స్‌ వ్యాపార కన్సాలిడేషన్‌ గత నవంబరు నుంచి అమలులోకి రావడంతో పాటు మొబైల్‌ చార్జీల పెంపు కంపెనీ లాభాల వృద్ధికి దోహదపడింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.2,876.4 కోట్లుగా నమోదైంది. క్యూ3లో రూ.45,129.3 కోట్ల ఆదాయాన్ని గడించింది. 2023-24 క్యూ3లో నమోదైన రూ.37,899.5 కోట్ల రెవెన్యూతో పోలిస్తే 19 శాతం వృద్ధి కనబరిచింది. కాగా, ఈ క్యూ3లో కంపెనీకి ఒక్కో వినియోగదారు నుంచి లభించిన సగటు ఆదాయం (ఆర్పూ) రూ.245కు పెరిగింది.


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 07 , 2025 | 01:50 AM