LinkedIn Survey: ఏఐ మన మెదళ్లను భర్తీ చేయలేదు
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:22 AM
కృత్రిమ మేధ (ఏఐ) ఎంతగా అభివృద్ధి చెందినా అది మానవ మస్తిష్కానికి ప్రత్యామ్నాయం కాదని సర్వేలు చెబుతున్నాయి. వృత్తి నిపుణుల ఏఐ వినియోగంపై లింక్డ్‌ఇన్ జరిపిన ఒక సర్వేలోనూ...
స్పష్టం చేసిన లింక్డ్‌ఇన్ సర్వే
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): కృత్రిమ మేధ (ఏఐ) ఎంతగా అభివృద్ధి చెందినా అది మానవ మస్తిష్కానికి ప్రత్యామ్నాయం కాదని సర్వేలు చెబుతున్నాయి. వృత్తి నిపుణుల ఏఐ వినియోగంపై లింక్డ్‌ఇన్ జరిపిన ఒక సర్వేలోనూ ఇదే విషయం తేలింది. ఈ సర్వేలో పాల్గొన్న హైదరాబాద్ వృత్తి నిపుణుల్లో ప్రతి ఐదుగురిలో నలుగురు ఇదే విషయం చెప్పారు. ఇంకా ఈ సర్వేలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 78 శాతం మంది ఏఐ రైటింగ్, డ్రాఫ్టింగ్‌కు ఉపయోగపడుతుంది తప్ప, నిర్ణయాలు తీసుకునేందుకు పనికి రాదన్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఏఐ కంటే తమ బుద్ధి లేదా సహచరులు, మేనేజర్లను నమ్ముకుంటాం తప్ప ఏఐని కాదని 83 నుంచి 88 శాతం మంది చెప్పారు. సర్వే ఇతర ప్రధాన అంశాలు..
మరో ఉద్యోగం చూసుకోవాలంటే ఏఐపై పట్టు తప్పనిసరి అని అన్న నాలుగింట మూడు వంతుల మంది
వేగంగా ఏఐ నేర్చుకునేందుకు 70ు మంది ఆసక్తి
ఉద్యోగులు ఏఐ నేర్చుకోవాలని కోరుతున్న 77 శాతం కంపెనీలు
నియామకాలు, సమీక్షల్లో ఏఐపై పట్టును పరిగణనలోకి తీసుకుంటున్న 64 శాతం ఎగ్జిక్యూటివ్‌లు
మంచి వ్యాపార నిర్ణయాలు ఏఐ ద్వారా కంటే మానవ మస్తిష్కం ద్వారానే వస్తాయని నమ్ముతున్న 83 శాతం ఎగ్జిక్యూటివ్‌లు.
ఇవీ చదవండి:
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ మెగా డీల్
ఫ్లిప్‌కార్ట్‌లో 2.2 లక్షల సీజనల్ ఉద్యోగాలు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి