Trade Casual Tech Park: అదానీకనెక్స్ చేతికి ట్రేడ్ క్యాజిల్ టెక్ పార్క్
ABN , Publish Date - Nov 24 , 2025 | 01:06 AM
అదానీ గ్రూప్‌కు చెందిన జాయింట్ వెంచర్ అదానీకనెక్స్..ముంబైకి చెందిన మౌలిక వసతుల అభివృద్ధి కంపెనీ ట్రేడ్ క్యాజిల్ టెక్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్‌ను (టీసీటీపీపీఎల్) రూ. 231.34 కోట్లకు...
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌కు చెందిన జాయింట్ వెంచర్ అదానీకనెక్స్..ముంబైకి చెందిన మౌలిక వసతుల అభివృద్ధి కంపెనీ ట్రేడ్ క్యాజిల్ టెక్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్‌ను (టీసీటీపీపీఎల్) రూ. 231.34 కోట్లకు చేజిక్కించుకున్నట్లు ప్రకటించింది. దేశంలో డేటా సెంటర్ల రంగంలో భారీ విస్తరణకు సిద్ధమవుతున్న అదానీకనెక్స్.. ఈ మేరకు టీసీటీపీపీఎల్ వాటాదారులైన అయిన శ్రీ నమాన్ డెవలపర్స్, జయేస్ షాలతో కొనుగోలు ఒప్పందం (ఎస్‌పీఏ) కుదుర్చుకుంది. ఈ డీల్ ఈ నెల 25 నాటికి పూర్తయ్యే అవకాశముంది. వచ్చే పదేళ్లలో 1 గిగావాట్ జాతీయ డేటా సెంటర్ నెట్‌వర్క్‌ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న అదానీకనెక్స్ హైదరాబాద్, చెన్నై, నవీ ముంబై, నోయిడా, పుణేలో డేటా సెంటర్లను నిర్వహిస్తోంది.
ఇవీ చదవండి:
అన్‌క్లెయిమ్డ్ బీమా మొత్తాలు క్లెయిమ్ చేసుకోవడం ఎలా
అమెజాన్‌లో భారీ లే ఆఫ్స్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పైనే ఎక్కువ ఎఫెక్ట్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి