Adani Group Airport Expansion: ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Dec 20 , 2025 | 07:06 AM
విమానాశ్రయాల వ్యాపార విస్తరణపైనా అదానీ గ్రూప్ ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు గౌతమ్ అదానీ చిన్న కుమారుడు, అదానీ ఎయిర్‌పోర్ట్స్ డైరెక్టర్ జీత్ అదానీ...
విమానాశ్రయ వ్యాపార విస్తరణపై అదానీ గ్రూప్ ప్రత్యేక ఫోకస్
ఈ నెల 25న నవీ ముంబై విమానాశ్రయం ప్రారంభం
అదానీ ఎయిర్‌పోర్ట్స్ డైరెక్టర్ జీత్ అదానీ
ముంబై: విమానాశ్రయాల వ్యాపార విస్తరణపైనా అదానీ గ్రూప్ ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు గౌతమ్ అదానీ చిన్న కుమారుడు, అదానీ ఎయిర్‌పోర్ట్స్ డైరెక్టర్ జీత్ అదానీ వెల్లడించారు. దేశ వైమానిక, విమానాశ్రయాల రంగం మరో 10-15 ఏళ్ల పాటు ఏటా సగటున 15 నుంచి 16 శాతం చొప్పున అభివృద్ధి చెందనుందని దీంతో ఎయిర్‌పోర్టుల వ్యాపారానికి మంచి భవిష్యత్ ఉంటుందని జీత్ అదానీ చెప్పారు.
మరిన్ని ఎయిర్‌పోర్టులపై నజర్: అదానీ గ్రూప్ ఇప్పటికే ముంబై, అహ్మదాబాద్, లఖ్‌నవూ, గువహతి, తిరువనంతపురం, జైపూర్, మంగళూరు విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. ఇందులో ముంబై ఎయిర్‌పోర్ట్‌ను జీవీకే గ్రూప్ నుంచి కొనుగోలు చేసింది. మిగతా వాటిని ప్రైవేటీకరణలో భాగంగా ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసింది. ఇవిగాక ప్రభుత్వం త్వరలో ప్రైవేట్‌పరం చేసే 11 విమానాశ్రయాల కోసం పోటీపడబోతున్నట్టు జీత్ ప్రకటించారు. కాగా కొత్తగా నిర్మించిన నవీ ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి ఈ నెల 25 నుంచి వాణిజ్య పద్దతిలో విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. రూ.19,650 కోట్ల పెట్టుబడితో అదానీ గ్రూప్ ఈ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించింది. ప్రస్తుతం ఏటా రెండు కోట్ల మంది రాకపోకలకు అనుగుణంగా నిర్మించిన నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను భవిష్యత్‌లో తొమ్మిది కోట్ల మంది రాకపోకలకు అనుగుణంగా విస్తరించబోతున్నట్టు చెప్పారు.
ఇవీ చదవండి:
రూపాయి పతనంపై దిగులొద్దు: సంజీవ్ సన్యాల్