Adani Group BESS Project: బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ రంగంలోకి అదానీ
ABN , Publish Date - Nov 12 , 2025 | 05:00 AM
బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు అదానీ గ్రూప్ మంగళవారం ప్రకటించింది. గుజరాత్‌లోని ఖావ్డాలో 1,126 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం; 3,530 మెగావాట్-హవర్ ఇంధన స్టోరేజీ...
దేశంలో అతిపెద్ద బీఈఎ్‌సఎస్ ప్రాజెక్టు నిర్మాణం
న్యూఢిల్లీ: బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు అదానీ గ్రూప్ మంగళవారం ప్రకటించింది. గుజరాత్‌లోని ఖావ్డాలో 1,126 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం; 3,530 మెగావాట్-హవర్ ఇంధన స్టోరేజీ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎ్‌సఎస్) ప్రాజెక్టును నిర్మించాలనుకుంటున్నట్లు తెలిపింది. దేశంలో ఇదే అతిపెద్ద బీఈఎ్‌సఎస్ ప్రాజెక్టు కానుంది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రాజెక్టుల్లోనూ ఒకటిగా నిలవనుంది. 700కు పైగా బీఈఎ్‌సఎస్ కంటైనర్లను కలిగి ఉండనున్న ఈ ప్రాజెక్టు 2026 మార్చి నాటికి ప్రారంభం కావచ్చని అదానీ గ్రూప్ వెల్లడించింది. ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యువల్ ఎనర్జీ ప్లాంట్ అయిన ఖావ్డా రెన్యువబుల్ ఎనర్జీ కాంప్లెక్స్‌లో భాగంగా ఉందనుందని ప్రకటనలో పేర్కొంది.
పునరుత్పాదక ఇంధనాన్ని మరింత నమ్మదగినదిగా మార్చడంతో పాటు బ్యాకప్ పవర్ కల్పించేందుకు, గ్రిడ్ స్థిరత్వాన్ని మెరుగుపరిచేందుకు బ్యాటరీ స్టోరేజీ అవసరం. సోలార్, పవన విద్యుత్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్‌ను నిక్షిప్తం చేసి, అవసరమైనప్పుడు వినియోగించుకునేందుకు బ్యాటరీ స్టోరేజీ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది.
మరిన్ని అదానీ వ్యాపారాల లిస్టింగ్: అదానీ గ్రూప్ మరిన్ని వ్యాపారాలను లిస్ట్ చేయాలనుకుంటోంది. ఎయిర్‌పోర్ట్‌లు, రోడ్లు, మెటల్స్, డేటా సెంటర్ అనుబంధ విభాగాలు ఈ జాబితాలో ఉన్నట్లు తెలిసింది. 2027-31 మధ్యకాలంలో వీటి లిస్టింగ్ జరగవచ్చని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..
లాభాలతో ప్రారంభమై నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..