Share News

అనిశ్చితికి తెర!

ABN , Publish Date - Feb 03 , 2025 | 06:48 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం రేంజ్‌ బౌండ్‌ నుంచి లాభాల్లో చలించే అవకాశం ఉంది. యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ వడ్డీ రేట్ల అంశం ముగిసింది. తాజాగా మోదీ సర్కార్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది...

అనిశ్చితికి తెర!

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం రేంజ్‌ బౌండ్‌ నుంచి లాభాల్లో చలించే అవకాశం ఉంది. యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ వడ్డీ రేట్ల అంశం ముగిసింది. తాజాగా మోదీ సర్కార్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. దీంతో మార్కెట్లలో అనిశ్చితికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపై జియో పొలిటకల్‌ పరిస్థితులు, ట్రంప్‌ టారి్‌ఫ్సను బట్టి మార్కెట్లు కదలాడొచ్చు. బడ్జెట్‌ నేపథ్యంలో ఫైనాన్స్‌, డిఫెన్స్‌, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇన్‌ఫ్రా, అగ్రి షేర్లు పుంజుకునే అవకాశం ఉంది. ఫియర్‌ ఇండెక్స్‌ విక్స్‌ మళ్లీ 15 శాతం దిగువకు చేరింది.

స్టాక్‌ రికమండేషన్స్‌

ఫీనిక్స్‌ మిల్స్‌: ఈ షేరు ప్రస్తుతం ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తోంది. మంచి రివార్డు రేషియోతో దొరుకుతున్నాయి. తాజా ఆర్థిక ఫలితాలు బాగానే ఉన్నాయి. రిలేటివ్‌ స్ట్రెంత్‌ పెరుగుతోంది. చివరి ఆరు సెషన్లలో ఈ షేరు 21 శాతం మేర లాభపడటం గమనార్హం. గత శనివారం రూ.1,764 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,700 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.1,950/ 2,000 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,650 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


కావేరీ సీడ్స్‌: జీవితకాల గరిష్ఠం తర్వాత ఈ కౌంటర్‌లో 32 శాతం మేర దిద్దుబాటు జరిగింది. కొన్ని నెలల సుదీర్ఘ కన్సాలిడేషన్‌ తర్వాత చక్కని మూమెంటమ్‌ ప్రదర్శిస్తోంది. నిఫ్టీతో పోలిస్తే జోరు కనబరుస్తోంది. ప్రస్తుతం ఆకర్షణీయమైన జోన్‌లో లభిస్తోంది. గత శనివారం రూ.965 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.940 శ్రేణిలో ప్రవేశించి రూ.1,050 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.910 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

కార్‌ ట్రేడ్‌: నష్టాల మార్కెట్లు ఈ షేరు పటిష్ఠతను ప్రదర్శించింది. డిసెంబరు త్రైమాసిక ఫలితాల తర్వాత మెరుగైన వాల్యూమ్‌తో పుంజుకుంది. ఐపీఓ గరిష్ఠ స్థాయిని బ్రేక్‌ చేసి నిలదొక్కుకుంది. ఈపీఎస్‌, నికర లాభం పెరగటం సానుకూల అంశాలు. గత శనివారం ఈ షేరు రూ.1,766 వద్ద క్లోజైంది. మదుపరులు ఈ కౌంటర్‌లో రూ.1,700 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.1,950 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,660 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఇమామీ లిమిటెడ్‌: తృతీయ త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉండటంతో ఈ షేరు టర్న్‌ అరౌండ్‌ అయ్యింది. జీవిత కాల గరిష్ఠం నుంచి 40 శాతం పతనమైన ఈ షేరు చివరి ఏడు సెషన్లలో 17 శాతం మేర పెరిగింది. గత శనివారం రూ.625 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లోకి మదుపరులు రూ.610 వద్ద పొజిషన్‌ తీసుకుని రూ.740 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.575 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

హీరో మోటో: జీవితకాల గరిష్ఠం నుంచి 35 శాతం మేర పతనమైన ఈ షేరు ప్రస్తుతం ఆకర్షణీయమైన జోన్‌లో దొరుకుతున్నాయి. కీలకమైన రూ.4,000 స్థాయిలో మద్దతు లభించటంతో టర్న్‌ అరౌండ్‌ అయ్యింది. ఆర్థిక ఫలితాల విడుదల సమీపిస్తుండటంతో చివరి ఐదు సెషన్ల నుంచి లాభాల్లోనే ముగుస్తున్నాయి. గత శనివారం రూ.4,402 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.4,375 స్థాయిలో పొజిషన్‌ తీసుకుని రూ.4,800 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.4,325 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.


IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 03 , 2025 | 06:48 AM