కన్సాలిడేషన్‌కు చాన్స్!
ABN , Publish Date - Feb 24 , 2025 | 05:22 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా చలించే అవకాశం ఉంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందే వరకు సూచీలకు ఒక గమనం ఉండకపోవచ్చు. డొనాల్డ్ ట్రంప్ టారి్‌ఫ్సపై వరుసగా...

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా చలించే అవకాశం ఉంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందే వరకు సూచీలకు ఒక గమనం ఉండకపోవచ్చు. డొనాల్డ్ ట్రంప్ టారి్‌ఫ్సపై వరుసగా ప్రకటనలు చేస్తుండటంతో మదుపరులు గందరగోళానికి లోనవుతున్నారు. ఇప్పటికే బెంచ్‌మార్క్ సూచీలు కనిష్ఠాలకు చేరటంతో కన్సాలిడేషన్‌కు అవకాశం లేకపోలేదు. నిఫ్టీకి 22,800 స్థాయిలో బలమైన మద్దతు ఉంది.
స్టాక్ రికమండేషన్స్
వాబగ్ టెక్నాలజీ: డిసెంబరులో జీవితకాల గరిష్ఠాన్ని తాకిన ఈ షేరు 42 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. కీలకమైన రూ.1,200 స్థాయిలో మద్దతు దొరికింది. ట్రేడింగ్, డెలివరీ వాల్యూమ్ పెరుగుతండటం, ట్రెండ్ రివర్సల్‌కు అవకాశం ఉండటం శుభపరిణామం. గత శుక్రవారం రూ.1,434 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.1,400 స్థాయిలో పొజిషన్ తీసుకుని రూ.1,550/1,600 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,360 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
సెయిల్: గత ఏడాది మే నుంచి డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తున్న ఈ కౌంటర్‌లో జనవరి నుంచి బేస్ ఏర్పడుతోంది. ప్రైస్ యాక్షన్ టైట్‌గా కొనసాగుతోంది. డిసెంబరు త్రైమాసిక ఫలితాల అనంతరం మదుపరులు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా రిలేటివ్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంది. గత శుక్రవారం రూ.112 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.110/107 శ్రేణిలో ఎంటరై రూ.125/130 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.103 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
గోద్రెజ్ ఇండస్ట్రీస్: జనవరిలో రూ.1,246 స్థాయిలో నిరోధం ఎదుర్కొన్న ఈ షేరు వరుసగా పతనమవుతూ 34 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. కీలకమైన రూ.780 స్థాయిలో మళ్లీ పుంజుకుంది. భారీ వాల్యూమ్‌తో చివరి రెండు సెషన్లలోనే 40 శాతం మేర పెరిగింది. గత శుక్రవారం రూ.1,131 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లోకి ఇన్వెస్టర్లు రూ.1,050/1,000 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.1,250/1,350 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.960 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
జేఎ్‌సడబ్ల్యూ ఎనర్జీ: గత ఏడాది సెప్టెంబరు నుంచి డౌన్‌ట్రెండ్‌లో సాగుతూ వస్తున్న ఈ షేరుకు రూ.420 స్థాయిలో మద్దతు లభించింది. చివరి నాలుగు సెషన్లలో లాభాల్లోనే ముగిసింది. భారీ వాల్యూమ్‌తో 10, 20 రోజుల మూవింగ్ యావరేజీని బ్రేక్ చేసింది. గత శుక్రవారం ఈ షేరు 5.99 శాతం లాభంతో రూ.496 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో రూ.470 స్థాయిలో ప్రవేశించి రూ.550/600 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.445 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్: నష్టాల మార్కెట్లోనూ ఈ షేరు జోరు ప్రదర్శిస్తోంది. నిఫ్టీతో పోలిస్తే మెరుగ్గా ట్రేడవుతున్నాయి. ప్రాధమికంగా డౌన్‌ట్రెండ్‌లో ఉన్నప్పటికీ హయ్యర్ లోస్ నమోదవడం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. చివరి త్రైమాసికంలో ఈపీఎస్ విపరీతంగా పెరిగింది. గత శుక్రవారం రూ.4,545 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.4,480/4,450 పొజిషన్ తీసుకుని రూ.4,750 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.4,410 స్థాయిని స్టాప్‌లాస్ పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
Read More Business News and Latest Telugu News