Share News

కష్టపడితేనే 30 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యం

ABN , Publish Date - Mar 03 , 2025 | 01:46 AM

భారత్‌ను 2047 నాటికి 30 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా చేయాలంటే భారతీయులందరూ కష్టించి పని చేయాలని జీ-20 షెర్పా అమితాబ్‌ కాంత్‌ అన్నారు....

కష్టపడితేనే 30 లక్షల కోట్ల డాలర్ల  ఆర్థిక వ్యవస్థ సాధ్యం

న్యూఢిల్లీ: భారత్‌ను 2047 నాటికి 30 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా చేయాలంటే భారతీయులందరూ కష్టించి పని చేయాలని జీ-20 షెర్పా అమితాబ్‌ కాంత్‌ అన్నారు. ఆదివారం బిజినెస్‌ స్టాండర్డ్‌ మంథన్‌లో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ.. వారానికి 80 గంటలా లేక 90 గంటలు పని చేయాలా అనే కన్నా కష్టించి పని చేయాలన్నది తన ఉద్దేశమని చెప్పారు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4 లక్షల కోట్ల డాలర్లు. ప్రాజెక్టులను కాలం, నిర్మాణ వ్యయాలు హద్దులు దాటిపోకుండా పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన నొక్కి చెప్పారు. వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం రెండింటి మధ్య సమతూకం గురించిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. క్రమశిక్షణతో కూడిన పని జీవితం వల్ల రెండూ సాధించవచ్చని చెప్పారు. రోజుకి గంటన్నర మీ కోసం కేటాయించుకున్నా రోజులో ఇంకా 22.5 గంటల సమయం వృత్తి, వ్యక్తిగత జీవితాలను సమతూకం చేసుకునేందుకు అందుబాటులో ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రజలందరూ కష్టపడి పని చేయకపోతే ఏ దేశం అయినా అభివృద్ధి చెందిన దేశం కాలేదని అన్నారు.


Read Also : Business Ideas: ఇండియాలో పోటీలేని టాప్ బిజినెస్ ఇదే.. తక్కువ ఖర్చు.. అధిక లాభాలు..

మిణుగురుల ప్రపంచంలోకి...

SugarCane Juice: ప్రతిరోజు చెరకు రసం తాగవచ్చా.. తాగితే ఏమవుతుంది..

మరిన్ని బిజినెస్, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 03 , 2025 | 01:46 AM