వారానికి 47.5 పని గంటలు చాలు
ABN , Publish Date - Feb 26 , 2025 | 05:40 AM
ఉద్యోగులు వారానికి 70 నుంచి 90 గంటలు పని చేయాలనే వాదనని ప్రముఖ ఐటీ సేవల కంపెనీ క్యాప్‌జెమినీ ఇండియా సీఈఓ అశ్విన్ యార్డి తోసిపుచ్చారు....

క్యాప్‌జెమినీ సీఈఓ అశ్విన్
ముంబై: ఉద్యోగులు వారానికి 70 నుంచి 90 గంటలు పని చేయాలనే వాదనని ప్రముఖ ఐటీ సేవల కంపెనీ క్యాప్‌జెమినీ ఇండియా సీఈఓ అశ్విన్ యార్డి తోసిపుచ్చారు. రోజుకు 9.5 గంటల చొప్పున వారంలో ఐదు రోజుల పనిచేస్తే చాలన్నారు. వారాంతాల్లో ఆఫీసు పని కోసం ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపే విధానానికీ తాను వ్యతిరేకమన్నారు. నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్‌షిప్ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంపన్న భారత్ కోసం ఉద్యోగులు వారానికి 70 గంటలు పని చేస్తే బాగుంటుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపక చైర్మన్ నారాయణ మూర్తి, కాదు 90 గంటలు పని చేయాలని ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రమణియన్ ఇటీవల సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్యాప్‌జెమినీ ఇండియా సీఈఓ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఉద్యోగులు ఎన్ని గంటలు పని చేశారనిగాక, వారి నుంచి ఎంత ఉత్పాదకత వచ్చిందనేది అత్యంత ముఖ్యమని యార్డి అన్నారు.
ఇవి కూడా చదవండి:
Amit Shah: 2 రోజుల్లోనే రూ. 30,77,000 కోట్ల పెట్టుబడులు.. కేంద్ర హోమంత్రి అమిత్ షా ప్రశంసలు
Liquor Scam: లిక్కర్ స్కాం వల్ల ప్రభుత్వానికి 2 వేల కోట్లకుపైగా నష్టం..
Ashwini Vaishnaw: మన దగ్గర హైపర్ లూప్ ప్రాజెక్ట్ .. 300 కి.మీ. దూరం 30 నిమిషాల్లోనే..
Maha Kumbh Mela: శివరాత్రికి ముందే మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తజనం.. ఇప్పటివరకు ఎంతమంది వచ్చారంటే..
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Read More Business News and Latest Telugu News