Share News

Nifty Tech View: 24500 వద్ద నిలదొక్కుకోవడం కీలకం

ABN , Publish Date - Aug 04 , 2025 | 01:54 AM

నిఫ్టీ గత వారంలో కూడా నిఫ్టీ మైనర్‌ రికవరీతో ప్రారంభమైనా కీలక స్థాయి 25,000 వద్ద నిలదొక్కుకోవడంలో విఫలమై వారం మొత్తానికి 270 పాయింట్ల నష్టంతో 24,565 వద్ద ముగిసింది. గత ఐదు...

Nifty Tech View: 24500 వద్ద నిలదొక్కుకోవడం కీలకం

టెక్‌ వ్యూ: 24,500 వద్ద నిలదొక్కుకోవడం కీలకం

నిఫ్టీ గత వారంలో కూడా నిఫ్టీ మైనర్‌ రికవరీతో ప్రారంభమైనా కీలక స్థాయి 25,000 వద్ద నిలదొక్కుకోవడంలో విఫలమై వారం మొత్తానికి 270 పాయింట్ల నష్టంతో 24,565 వద్ద ముగిసింది. గత ఐదు వారాలుగా నిరంతర డౌన్‌ట్రెండ్‌లో ఉన్న మార్కెట్‌ గరిష్ఠ స్థాయి 25,670 నుంచి 1,000 పాయింట్ల మేరకు నష్టపోయింది. మిడ్‌క్యాప్‌- 100 సూచీ 1,370 పాయింట్లు, స్మాల్‌క్యాప్‌-100 సూచీ 625 పాయింట్లు నష్టపోయాయి. అలాగే నాలుగు నెలల వరుస ర్యాలీ అనంతరం జూలై నెలలో నిఫ్టీ 750 పాయింట్ల మేరకు నష్టపోయి ఇటీవల ఏర్పడిన బాటమ్‌ 24,500 సమీపంలోకి వచ్చింది.

బుల్లిష్‌ స్థాయిలు: భద్రత కోసం నిఫ్టీ 24,500 వద్ద తప్పనిసరిగా నిలదొక్కుకోవాలి. ఇప్పుడు రికవరీ బాట పట్టినట్టయితే మైనర్‌ నిరోధం 24,700 పైన నిలదొక్కుకున్నప్పుడే మైనర్‌ అప్‌ట్రెండ్‌కు ఆస్కారం ఉంటుంది. ప్రధాన నిరోధం 25,000. ఇదే స్వల్పకాలిక నిరోధ స్థాయి. గత రెండు మాసాలుగా ఇక్కడే ప్రధాన కన్సాలిడేషన్‌ చోటు చేసుకుంటోంది.

బేరిష్‌ స్థాయిలు: బలహీనత ప్రదర్శించినా భద్రత కోసం 24,500-24,450 స్థాయిలో నిలదొక్కుకుని తీరాలి. విఫలమైతే స్వల్పకాలిక బలహీనత ఏర్పడుతుంది. ఇన్వెస్టర్లు అప్రమత్తం కావాలి. ప్రధాన మద్దతు స్థాయిలు 24250, 24000.

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ గత వారం 910 పాయింట్లు నష్టపోయి 55,600 సమీపంలో ముగిసింది. ప్రధాన బాటమ్‌ 55,500 చేరువవుతోంది. సానుకూలత కోసం ఇక్కడ కన్సాలిడేట్‌ కావాలి. అలాగే ట్రెండ్‌లో సానుకూలత కోసం ప్రధాన నిరోధం 56,100 వద్ద నిలదొక్కుకోవాలి.


పాటర్న్‌: నిఫ్టీ 100 డిఎంఏకి చేరువవుతోంది. అలాగే 24,500 సమీపంలో ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ సమీపంలోకి వస్తోంది. సానుకూలత కోసం ఇక్కడ బౌన్స్‌బ్యాక్‌ తప్పనిసరి. గతంలో ఇక్కడే నాలుగు మేజర్‌ బాటమ్‌లు ఏర్పడ్డాయి. ఈ కీలక స్థాయిలో నిలదొక్కుకోవడం తప్పనిసరి.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం బుధవారం మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం: 24,640, 24,700

మద్దతు: 24,450, 24,390

వి. సుందర్‌ రాజా

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 04 , 2025 | 02:16 AM