Share News

2034 నాటికి రూ.190 లక్షల కోట్లకు..

ABN , Publish Date - Mar 03 , 2025 | 01:59 AM

మన దేశంలో రిటైల్‌ మార్కెట్‌ శరవేగంగా వృద్ధి చెందుతోంది. 2014లో రూ.35 లక్షల కోట్లుగా ఉన్న ఈ మార్కెట్‌ గత ఏడాది (2024) రూ.82 లక్షల కోట్లకు చేరింది. గత పదేళ్లలో...

2034 నాటికి రూ.190 లక్షల కోట్లకు..

జోరుగా రిటైల్‌ మార్కెట్‌ వృద్ధి.. వినియోగదారుల అభిరుచులే కీలకం: బీసీజీ

న్యూఢిల్లీ: మన దేశంలో రిటైల్‌ మార్కెట్‌ శరవేగంగా వృద్ధి చెందుతోంది. 2014లో రూ.35 లక్షల కోట్లుగా ఉన్న ఈ మార్కెట్‌ గత ఏడాది (2024) రూ.82 లక్షల కోట్లకు చేరింది. గత పదేళ్లలో ఏటా సగటున 8.9 శాతం చొప్పున వృద్ధి రేటు సాధించింది. వృద్ధి రేటు ఇలానే కొనసాగితే 2034 నాటికి భారత రిటైల్‌ మార్కెట్‌ రూ.190 లక్షల కోట్లకు చేరుతుందని రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌ఏఐ)తో కలిసి రూపొందించిన ఒక నివేదికలో బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) తెలిపింది.

పెరుగుతున్న దేశ జీడీపీ, వినియోగదారుల భిన్న అభిరుచులు ఈ వృద్ధిలో కీలక పాత్ర పోషించబోతున్నట్టు పేర్కొంది. ఒక్క కొవిడ్‌ సమయంలో తప్ప మిగతా అన్ని సమయాల్లో మన దేశ రిటైల్‌ మార్కెట్‌ సుస్థిర అభివృద్ధినే నమోదు చేసినట్టు తెలిపింది.


వ్యూహాలే కీలకం

కాకపోతే రిటైల్‌ కంపెనీలు ఇందుకోసం ఆయా వర్గాల వినియోగదారుల అభిరుచులు, ఆర్థిక స్థోమతుల ఆఽధారంగా తమ ఉత్పత్తులు, మార్కెటింగ్‌ వ్యూహాలు రూపొందించుకోవాలని బీసీజీ నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా పట్టణ (ఇండియా), గ్రామీణ (భారత్‌) ప్రాంత వినియోగదారుల ప్రత్యేక అవసరాలను, ఆర్థిక స్థోమతను దృష్టిలో ఉంచుకోవాలని కోరింది. వినియోగదారుల అభిరుచుల్లో ఉండే వ్యత్యాసాలను ఆకళింపు చేసుకునే రిటైల్‌ కంపెనీలు మాత్రమే మార్కెట్లో రాణిస్తాయని స్పష్టం చేసింది. ఒకే నగరంలోని వినియోగదారుల అభిరుచులన్నీ ఒకేవిధంగా ఉండవని కూడా తెలిపింది.


నివేదిక ఇతర ప్రధానాంశాలు

  • కొనుగోలు నిర్ణయాల్లో ‘వాల్యూ ఫర్‌ మనీ’ కీలకం

  • వినియోగదారుల అభిరుచులు-వస్తువుల అందుబాటు ధరల మధ్య సమతూకం ఉండాలి

  • మన దేశ వినియోగదారుల్లోని భిన్నత్వాన్ని రిటైల్‌ కంపెనీలు అర్థం చేసుకోవాలి

  • కొనుగోలు నిర్ణయాల్లో పెరుగుతున్న మహిళల పాత్ర

  • రిటైల్‌ రంగంలో అవకాశాలతో పాటు సవాళ్లూ ఉన్నాయి

  • ఇంకా ఆఫ్‌లైన్‌ ద్వారానే 58 శాతం కొనుగోళ్లు

  • గ్లోబల్‌ ట్రెండ్స్‌, బ్రాండ్లపై వినియోగదారుల ఆసక్తి

  • స్థానిక ఉత్పత్తులకీ మంచి డిమాండ్‌


Read Also : Business Ideas: ఇండియాలో పోటీలేని టాప్ బిజినెస్ ఇదే.. తక్కువ ఖర్చు.. అధిక లాభాలు..

మిణుగురుల ప్రపంచంలోకి...

SugarCane Juice: ప్రతిరోజు చెరకు రసం తాగవచ్చా.. తాగితే ఏమవుతుంది..

మరిన్ని బిజినెస్, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 03 , 2025 | 01:59 AM