అమెరికాలో భారతీయుల సత్తా
ABN , Publish Date - Jul 11 , 2025 | 03:12 AM
దేశం కాని దేశం. అయినా సరే ‘ఆస్తుల సంపాదనలో తగ్గేదేలే’ అంటున్నారు అమెరికాలోని భారతీయులు. విద్య లేదా ఉ పాధి కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడిన భారతీయుల్లో కొందరు రెండు చేతులా...
వలస బిలియనీర్ల జాబితాలో 12 మంది
అగ్రస్థానంలో జై చౌదురి
సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్‌కు చోటు
ఫోర్బ్స్ పత్రిక వెల్లడి
న్యూఢిల్లీ: దేశం కాని దేశం. అయినా సరే ‘ఆస్తుల సంపాదనలో తగ్గేదేలే’ అంటున్నారు అమెరికాలోని భారతీయులు. విద్య లేదా ఉ పాధి కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడిన భారతీయుల్లో కొందరు రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ సంపాదనలో వీరు స్థానిక అమెరికన్లనూ మించిపోతున్నారు. అమెరికాలో 100 కోట్ల డాలర్ల కం టే ఎక్కువ సంపద ఉన్న వలసదారుల జాబితాలో ఈ సంవత్సరం అత్యధికంగా భారత్‌కు చెందిన 12 మందికి చోటు దక్కింది. గతంలో ఎన్నడూ ఇంతమంది భారత వలసదారులు బిలియనీర్ల జాబితాలో చేరలేదని ‘2025 అమెరికా రిచెస్ట్ ఇమ్మిగ్రెంట్స్ లిస్ట్’ పేరుతో ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన నివేదిక వెల్లడించింది. భారత్ తర్వాత ఇజ్రాయెల్, తైవాన్ దేశాలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. కాగా ఈ సంవత్సరం ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన వలస బిలియనీర్ల జాబితాలో గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, తెలుగువాడైన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరి ఆస్తుల విలువ చెరో 110 కోట్ల డాలర్ల (సుమారు రూ.9,427 కోట్లు) వరకు ఉంటుందని ఫోర్బ్స్ పత్రిక అంచనా. సైబర్ సెక్యూరిటీ సంస్థ జెడ్‌స్కేలర్ వ్యవస్థాపకుడు, సీఈఓ జై చౌదురి ఈ విషయంలో 1,790 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.53 లక్షల కోట్లు) సంపదతో మిగతా భారత బిలియనీర్లు అందరి కంటే ముందున్నారు.
ఎలాన్ మస్క్‌దే అగ్రస్థానం
అమెరికాకు వలస వచ్చి పెద్దమొత్తంలో ఆస్తులు కూడబెట్టిన వలసదారుల్లో టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌దే అగ్రస్థానం. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ 39,300 కోట్ల డాలర్లని (సుమారు రూ.33.68 లక్షల కోట్లు) ఫోర్బ్స్ తెలిపింది. గూగుల్ సహ వ్యవస్థాకుడు సెర్జీ బ్రైన్ (13,970 కోట్ల డాలర్లు), ఎన్‌విడియా సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జెన్‌సెన్ హుయాంగ్ (13,790 కోట్ల డాలర్లు) డాలర్ల సంపదతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు
అమెరికాలో టాప్-12 భారత వలస బిలియనీర్లు
పేరు ఆస్తుల విలువ
(కోట్ల డాలర్లలో)
జై చౌదురి 1,790
వినోద్ ఖోస్లా 920
రాకేశ్ గంగ్వాల్ 660
రొమేష్ టీ వాద్వానీ 500
రాజీవ్ జైన్ 480
కవితార్క్ రామ్ శ్రీరామ్ 300
రాజ్ సర్దానా 200
డేవిడ్ పాల్ 150
నిఖేష్ అరోరా 140
సుందర్ పిచాయ్ 110
సత్య నాదెళ్ల 110
నీరజా సేథి 100
ఇవి కూడా చదవండి
ఇన్‌కం ట్యాక్స్ 2025 కొత్త రూల్స్.. ఈ అప్‌డేట్ ప్రక్రియ తప్పనిసరి
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి