Share News

YS Sharmila: లిక్కర్‌ సిరీస్‌పై జగన్‌కు భయం పట్టుకుంది

ABN , Publish Date - May 23 , 2025 | 04:51 AM

లిక్కర్‌ స్కామ్‌పై సీబీఐ లేదా న్యాయవిచారణ జరగాలని షర్మిల డిమాండ్ చేశారు. విచారణకు జగన్‌ సిద్ధం కాకపోతే తప్పు చేసినట్టు అర్థమని అన్నారు.

YS  Sharmila: లిక్కర్‌ సిరీస్‌పై జగన్‌కు భయం పట్టుకుంది

  • అందుకే మీడియా సమావేశం

  • నిజాలు తేలేందుకు విచారణ కోరాలి

  • ఆదాయం ఎటుపోయిందో చెప్పాలి

  • దర్యాప్తునకు సిద్ధపడటం లేదంటే తప్పు చేశారనే అర్థం: షర్మిల

అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): లిక్కర్‌ స్కామ్‌లో నిజానిజాలు తేలేందుకు మాజీ సీఎం జగన్‌ విచారణను కోరాలని పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. దర్యాప్తునకు సిద్ధపడటం లేదంటే ఆయన తప్పు చేశారని అర్థమవుతోందన్నారు. వైసీపీ హయాంలో డిజిటల్‌ పేమెంట్‌ ఎందుకు జరగలేదో, వచ్చిన ఆదాయం ఎటుపోయిందో వెల్లడించాలన్నారు. లిక్కర్‌ మాఫియా థ్రిల్లర్‌ సిరీ్‌సతో వైసీపీకి, జగన్‌కు భయం పట్టుకుందన్నారు. ఆ భయాన్ని దూరం చేసేందుకు, కేడర్‌లో స్థైర్యం నింపేందుకే జగన్‌ మీడియా సమావేశాన్ని నిర్వహించారని చెప్పారు. గురువారం విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘సీఎంగా పనిచేసిన వ్యక్తి పోలీసులు, పోలీసు వ్యవస్థపై మాట్లాడిన తీరు బాధాకరం. పోలీసుల బట్టలు ఊడదీయిస్తాననడం ఏమిటి? విదేశాల్లో ఉన్నా పట్టుకుంటామని బెదిరించడం ఏమిటి? ఆయన సీఎంగా ఉన్న రోజుల్లో పోలీసులను ఎలా వాడుకున్నారో ప్రజలందరికీ తెలుసు. రఘురామరాజును అడిగితే మొత్తం చెబుతారు. నటి కాదంబరిని అడిగితే చెబుతుంది. 40 రోజుల పాటు ఆమెను బంధించలేదా? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోపణలు వస్తే హుందాగా తీసుకునేవారు. లిక్కర్‌లో అవినీతి జరిగిందని జగన్‌పై ఆరోపణలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలకు హాజరై స్కామ్‌పై వివరణ ఇవ్వాలి’ అని అన్నారు.

Updated Date - May 23 , 2025 | 04:52 AM