Nellore beach incident: బీచ్‌లో యువకుడి మృతి.. నెల్లూరు జిల్లాలో విషాదం..
ABN , Publish Date - Dec 21 , 2025 | 06:16 PM
సరదాగా స్నేహితులతో సముద్ర స్నానానికి వెళ్లిన యుగంధర్ అనే యువకుడు అలల తాకిడికి గల్లంతయ్యాడు. నెల్లూరు జిల్లా కోట మండలం శ్రీనివాససత్రం బీచ్‌కు స్నేహితులతో కలిసి వెళ్లిన యుగంధర్ (20) అనే విద్యార్థి మృతి చెందాడు.
నెల్లూరు జిల్లా కోట మండలంలో విషాదం నెలకొంది. కోట మండలం శ్రీనివాససత్రం బీచ్‌కు స్నేహితులతో కలిసి వెళ్లిన యుగంధర్ (20) అనే విద్యార్థి మృతి చెందాడు. సరదాగా స్నేహితులతో సముద్ర స్నానానికి వెళ్లి అలల తాకిడికి యుగంధర్ గల్లంతయ్యాడు (Kota Mandal beach death).
మృతుడు గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం (young man died Nellore). ఆదివారం మరో ఐదుగురు స్నేహితులతో కలిసి యుగంధర్ సరదాగా బీచ్‌కు వెళ్లి సముద్రంలోకి దిగాడు. అప్పటికే ఐదుగురు స్నేహితులు మద్యం సేవించి ఉన్నట్టు తెలుస్తోంది.
మద్యం మత్తులో బలమైన అలల తాకిడికి ఊపిరాడక యుగంధర్ మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు (beach accident Nellore). కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఇవీ చదవండి:
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పరిమితంగా ట్రంప్ ప్రస్తావన.. విమర్శల వెల్లువ
కెనడా జనాభాలో తగ్గుదల.. 1946 తరువాత తొలిసారిగా..