Share News

East Godavari: కలుపు మందుకు యువ రైతు బలి

ABN , Publish Date - Jun 01 , 2025 | 03:46 AM

తూర్పుగోదావరి జిల్లా చీపురుగూడెం గ్రామానికి చెందిన యువ రైతు చెల్లు లీలా కృష్ణప్రసాద్‌ కలుపు మందు టీషర్ట్‌పై పడిన తర్వాత గుంగెల్లో ప్రభావం ఏర్పడి చికిత్స పొందుతూ మరణించాడు. అతని అకాల మరణంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

East Godavari: కలుపు మందుకు యువ రైతు బలి

తూర్పుగోదావరి జిల్లా చీపురుగూడెంలో విషాదం

నల్లజర్ల, మే 31(ఆంధ్రజ్యోతి): కలుపు మందు శరీరంపై పడి ఒక యువ రైతు మృతిచెందాడు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చీపురుగూడెం గ్రామానికి చెందిన చెల్లు లీలా కృష్ణప్రసాద్‌ (30) పదిహేను రోజుల కిందట బైక్‌ పెట్రోల్‌ ట్యాంక్‌పై ఉండే కవర్‌లో కలుపు మందు తీసుకుని పొలానికి బయలుదేరాడు. అయితే ఆ కలుపు మందు తన పొట్ట బాగాన టీషర్ట్‌పై పడిన విషయాన్ని ప్రసాద్‌ గమనించలేదు. సాయంత్రం వరకు పొలం పనులు చేసుకుని తిరిగి ఇంటికొచ్చాడు. తర్వాత గుండీలు లేని టీషర్ట్‌ను ముఖంపై నుంచి తీసి స్నానం చేసి పడుకున్నాడు. మరుసటి రోజు కళ్లు తిరిగి పడిపోవడంతో తండ్రి సుబ్రహ్మణ్యం హుటాహుటిన నల్లజర్ల విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. కలుపు మందు ప్రభావం ఉందని, మరొక చోటుకు తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. మెరుగైన వైద్యం నిమిత్తం కృష్ణప్రసాద్‌ను తొలుత ఏలూరు, తర్వాత విజయవాడ తరలించారు. చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతిచెందాడు. ప్రసాద్‌కు ఏడాది క్రితం వివాహమైంది. అతని అకాల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


ఇవి కూడా చదవండి

శ్రీకాంత్‌ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు

కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 01 , 2025 | 03:46 AM