Share News

Yanaadu: ఎస్టీ వర్గీకరణ చేపట్టాలి: యానాదుల సంఘం

ABN , Publish Date - Feb 03 , 2025 | 05:47 AM

వెనుకబడిన యానాదులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడంతో పాటు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. ఆదివారం విజయవాడలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో రాష్ట్ర కన్వీనర్‌ కేసీ పెంచలయ్య అధ్యక్షతన రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

Yanaadu: ఎస్టీ వర్గీకరణ చేపట్టాలి: యానాదుల సంఘం

అమరావతి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ తరహాలో ఎస్టీ వర్గీకరణ చేపట్టాలని యానాదుల పొలిటికల్‌ ఫోరం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వెనుకబడిన యానాదులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడంతో పాటు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. ఆదివారం విజయవాడలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో రాష్ట్ర కన్వీనర్‌ కేసీ పెంచలయ్య అధ్యక్షతన రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఎస్టీ వర్గీకరణ కోసం దశల వారీగా పోరాటం చేపట్టాలని నిర్ణయించారు. వర్గీకరణ చేపట్టాలని కోరుతూ ఈ నెల 8న సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం అందించాలని, ఏప్రిల్‌ 14న నెల్లూరులో యానాదుల వర్గీకరణ భేరీ నిర్వహించాలని, ఎస్టీ వర్గీకరణ కోసం యానాది రిజర్వేషన్‌ పోరాట సమితి ఏర్పాటు చేయాలని తీర్మానించారు. రాష్ట్రంలోని గిరిజన తెగల్లో అధిక జనాభా కలిగిన యానాదులు నేటికీ వెనుకబడి ఉన్నారని, సామాజిక న్యాయం దిశగా ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వం.. ఎస్టీ వర్గీకరణ చేసి న్యాయం చేయాలని కోరారు. యానాదులకు చట్టసభల్లో అవకాశాలు కల్పించాలని, నామినేటెడ్‌ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లు యానాదులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. సమావేశంలో యానాది సంఘాల నాయకులు బాపట్ల బ్రహ్మయ్య, చేవూరు సుబ్బారావు, రావూరి రాజు, చలంచర్ల పెదబ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Drunk Man : ముద్రగడ నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం...

Botsa Satyanarayana: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం

Kondapalli Srinivas: అద్భుతం.. అస్సలు ఊహించలేదు.. బడ్జెట్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 03 , 2025 | 05:47 AM