Share News

Chairperson Rayapati Shailaja: ఆ నలుగురి ఉద్యోగాల తొలగింపునకు సూచిస్తాం

ABN , Publish Date - Jul 15 , 2025 | 03:56 AM

కాకినాడ రంగరాయ వైద్య కళాశాల అనుబంధమైన జీజీహెచ్‌లో పారా మెడికల్‌ విద్యార్థినులపై..

Chairperson Rayapati Shailaja: ఆ నలుగురి ఉద్యోగాల తొలగింపునకు సూచిస్తాం

  • రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ శైలజ

జీజీహెచ్‌ (కాకినాడ), జూలై 14 (ఆంధ్రజ్యోతి): కాకినాడ రంగరాయ వైద్య కళాశాల అనుబంధమైన జీజీహెచ్‌లో పారా మెడికల్‌ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ల్యాబ్‌ అటెండెంట్‌, టెక్నీషియన్లను ఉద్యోగాల నుంచి పూర్తిగా తొలగించమని ప్రభుత్వానికి సూచిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ రాయపాటి శైలజ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఆమె రంగరాయ వైద్య కళాశాలను సందర్శించి బాధిత విద్యార్థినులను కలుసుకుని అటెండెంట్‌, టెక్నీషియన్లు చేసిన అకృత్యాలను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Jul 15 , 2025 | 03:56 AM