Share News

Harassment: ఫీల్డ్‌ అసిస్టెంట్‌ వేధింపులకు మహిళా మేట్‌ ఆత్మహత్య

ABN , Publish Date - May 13 , 2025 | 04:50 AM

ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ చేస్తున్న అక్రమాలను ప్రశ్నించినందుకు మాధురి అనే మహిళా మేట్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె సెల్ఫీ వీడియోలో తన చావుకు కారణమైన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రవితేజపై చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే సౌమ్య కోరారు.

Harassment: ఫీల్డ్‌ అసిస్టెంట్‌ వేధింపులకు మహిళా మేట్‌ ఆత్మహత్య

సెల్ఫీ వీడియో తీసి.. పురుగుల మందు తాగి..

ఎమ్మెల్యే సౌమ్య.. ఆయనపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థన

విజయవాడ/చందర్లపాడు, మే 12 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా మేట్‌ (మేస్త్రి) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఫీల్డ్‌ అసిస్టెంట్‌ అక్రమాలపై సెల్ఫీ వీడియో రికార్డు చేసి.. ఆపై పురుగుల మందు తాగి తనువు చాలించారు. తన చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే సౌమ్యను కోరారు. ఎన్టీఆర్‌ జిల్లా చందర్లపాడు మండలం విపరింతలపాడు గ్రామంలో అబ్బూరి మాధురి.. ఉపాధి పథకంలో మహిళా మేట్‌గా పనిచేస్తున్నారు. గ్రామంలో ఉపాధి పనులకు ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా మైలా రవితేజ వ్యవహరిస్తున్నాడు. ఇటీవల రవితేజ పనికి హాజరుకాని వారికి మస్తర్లు వేయడం, ఒక కూలీని వేర్వేరు పనుల్లో చూపించి అదనపు కూలి డ్రా చేయడం చేస్తున్నారు. ఈ అవకతవకలపై మాధురి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను ప్రశ్నించారు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న రవితేజ పలు రకాలుగా వేధించడం మొదలుపెట్డారు. తీవ్ర మనస్థాపం చెందిన మాధురి.. శనివారం తన బాధ తెలియజేస్తూ సెల్ఫీ వీడియో రికార్డు చేసి.. అనంతరం పురుగుల మందు తాగారు.


గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను విజయవాడలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆమె మరణించారు. ఆమె మృతి తర్వాత సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. ‘నాకు టీడీపీ, సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అంటే ఎంతో అభిమానం. ఉపాధి పనుల్లో అవినీతి వల్ల పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుంది. ఉపాధి పనుల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. మైలా రవితేజ అందరి ముందు నా మీదకు వచ్చాడు. నా అంతు చూస్తానని బెదిరించాడు. ఎమ్మెల్యే సౌమ్య చాలా డైనమిక్‌. నా చావుకు కారణమైన రవితేజ అంతుచూడాలి. నా కుమార్తె బాధ్యతను చూసుకోవాలి. రవితేజ వంటివారిపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దృష్టి పెట్టాలి’ అని వీడియోలో చెప్పారు. ఆమె మృతదేహానికి నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నివాళులర్పించారు. చందర్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. మాధురి సెల్ఫీ వీడియోలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ అక్రమాలను వివరిస్తే, ఆమె భర్త వెంకటరావు మాత్రం.. తన భార్య కడుపునొప్పి కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని వాం గ్మూలం ఇచ్చారు. ఫీల్డ్‌ అసిస్టెంట్‌తో గ్రామంలోని అధికార పార్టీ నాయకులకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, దీంతో మాధురి భర్తపై ఒత్తిడి చేయించి అలా చెప్పించినట్టు సమాచారం.


ఇవి కూడా చదవండి..

Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..

Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల

Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 13 , 2025 | 04:50 AM